ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శరీరానికి అవసరమైన క్యాల్షియం ఎలా అందుతుంది? నిపుణులు ఏమంటున్నారంటే..

ABN, First Publish Date - 2022-04-21T19:14:23+05:30

క్యాల్షియం లోపం ఏర్పడితే చర్మం పొడి బారిపోతుంది. దంత సమస్యలు వస్తాయి. త్వరగా అలసిపోతారు. కండరాలు పట్టేస్తుంటాయి. ఇతర ముఖ్యమైన శరీర భాగాల పని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(21-04-2022)

క్యాల్షియం లోపం ఏర్పడితే చర్మం పొడి బారిపోతుంది. దంత సమస్యలు వస్తాయి. త్వరగా అలసిపోతారు. కండరాలు పట్టేస్తుంటాయి. ఇతర ముఖ్యమైన శరీర భాగాల పనితీరులోనూ తేడా వస్తుంది. ఎముకలు బలంగా ఉండాలంటే తగినంత క్యాల్షియం లభించేలా చూసుకోవాలి. రక్తం గడ్డకట్టడంలోనూ, నరాల పనితీరు సక్రమంగా ఉండేలా చూడటంలో క్యాల్షియం ముఖ్యపాత్ర పోషిస్తుంది. మరి శరీరానికి అవసరమైన క్యాల్షియం ఎలా అందుతుంది? అంటే ఇదిగో ఈ ఆహారాన్ని తీసుకోవాలంటున్నారు నిపుణులు.


ఉసిరిలో విటమిన్‌ - సితో పాటు ఐరన్‌, క్యాల్షియం సమృద్ధిగా లభిస్తాయి. ఉసిరికాయను నేరుగా తినొచ్చు. జ్యూస్‌, పొడి, షర్బత్‌ రూపంలో తీసుకోవచ్చు. మునగకాయలను అందరూ ఇష్టంగా తింటారు. అయితే మునగాకులను కూడా వారానికో రోజు తినేలా చూసుకోవాలి. మునగాకుల్లో క్యాల్షియం, ఐరన్‌, విటమిన్‌- ఎ, సి, మెగ్నీషియం తగినంత లభిస్తాయి. పరగడుపున ఒక  టీస్పూన్‌ మునగాకు పొడిని తీసుకుంటే క్యాల్షియం తగినంత లభిస్తుంది. 


నువ్వులను తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన క్యాల్షియంను పొందేలా చూసుకోవచ్చు. నువ్వులు, బెల్లం కలిపి తయారుచేసిన లడ్డూలు తీసుకుంటే క్యాల్షియం లెవెల్స్‌ పెరుగుతుంటాయు. రోజూ ఒక గ్లాసు పాలు తాగితే క్యాల్షియం లోపం ఏర్పడకుండా ఉంటుంది. అంతేకాదు పాలల్లో ఉండే క్యాల్షియంను శరీరం సులభంగా గ్రహిస్తుంది.

Updated Date - 2022-04-21T19:14:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising