ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బొప్పాయి వల్ల కలిగే లాభాలెన్నో..

ABN, First Publish Date - 2022-08-08T21:08:39+05:30

బొప్పాయి పండు(పొప్పడిపండు) తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొప్పాయి పండు(పొప్పడిపండు) తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఈ పండు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అవి..

  • బొప్పాయిలో విటమిన్‌ సి, యాంటీఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అవి కొవ్వు పేరుకు పోకుండా అడ్డుకుంటాయి.
  • శరీర బరువు తగ్గాలనుకునే వారికి ఇది దివ్య ఔషధం, పండు తీయగా ఉన్నా ఇందులో కాలరీస్‌ చాలా తక్కువ.
  • బొప్పాయిలో విటమిన్‌ సి ఎక్కువగా ఉండి ఇది  శరీరంలో రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది.
  • మధుమేహం వ్యాధితో బాధపడేవాళ్లు కూడా ఈ పండును నిస్సందేహంగా తినవచ్చు. డయాబెటిస్‌ వచ్చే అవకాశమున్న వారు ఈ పండు తింటే డయాబెటిస్‌ బారిన పడరు. 
  • ఈ పండులో విటమిన్‌ ‘ఎ’ కూడా ఉంటుంది. ఇది కళ్లకు ఎంతో మంచిది. చూపు మందగించకుండా కాపాడుతుంది.
  • ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి కూడా బొప్పాయి చాలా మంచిది. దీన్ని తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా ఇది పనిచేస్తుంది. 
  • బొప్పాయిలో పఫైన్‌ అండే డైజెస్టివ్‌ ఎంజైమ్‌ ఉంది. ఇది జీర్ణక్రియ సరిగ్గా జరిగేట్లు చేస్తుంది. ఇందులో ఉన్న పీచుపదార్థాల వల్ల మనం తీసుకునే ఆహారం సులభంగా అరుగుతుంది.
  • నెలసరి అప్పుడు రక్తస్రావం సరిగా అయ్యేట్లు చేస్తుంది.
  • బొప్పాయిలో విటమిన్‌ సి, బెటా కెరోటిన్‌ వంటి యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం మడతలు పడకుండా, చిన్నవయసులోనే వృద్ధాప్య ఛాయలు మీలో కనిపించకుండా కాపాడతాయి. 
  • బొప్పాయిలో పైటో న్యూట్రియంట్స్‌ ప్లవనాయిడ్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ శరీరంలోని కణాల డీఎన్‌ఎని పరిరక్షిస్తాయి. కేన్సర్‌ బారిన పడకుండా కాపాడతాయి.
  • స్నాక్స్‌లా బొప్పాయి ముక్కలను తింటే పని ఒత్తిడిని సైతం సులభంగా అధిగమించవచ్చు.



(నార్సింగ్‌-ఆంద్రజ్యోతి)

Updated Date - 2022-08-08T21:08:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising