ఈ సీజన్ పండుతో లాభాలెన్నో...
ABN, First Publish Date - 2022-10-10T16:04:55+05:30
సీతాఫలంలో విటమిన్లు, మినరల్స్ పుష్కలం. ఈ సీజన్‌లో విరివిగా వచ్చే సీతాఫలాలు తియ్యగా ఉండటమే కాదు.. ఆరోగ్యానికి
సీతాఫలంలో విటమిన్లు, మినరల్స్ పుష్కలం. ఈ సీజన్‌లో విరివిగా వచ్చే సీతాఫలాలు తియ్యగా ఉండటమే కాదు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్ ఎ, సి ఉండటం వల్ల కళ్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. బరువు తగ్గటానికి కూడా ఈ పండును తింటారు. తెల్లని తీపి గుజ్జు తింటే దంతాలు గట్టిగా ఉంటాయి. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు ఊడిపోవడం లాంటి సమస్యలు తగ్గిపోతాయి. మాంగనీస్, విటమిన్ సి ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి ఉపయోగం. రక్త ప్రసరణ వ్యవస్థను సాఫీగా ఉంచుతుంది. అలసట, చికాకును తగ్గించే గుణం వీటికి ఉంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తిన్న ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియను మెరుగు పరిచే గుణం వీటికి ఉంది. ఐరన్ విరివిగా దొరికే ఈ పండు వల్ల రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఆర్ధరైటిస్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇవి సీజనల్ వ్యాధులకు గురికాకుండా చేస్తాయి.
Updated Date - 2022-10-10T16:04:55+05:30 IST