ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వానాకాలంలో వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే..!

ABN, First Publish Date - 2022-08-23T18:00:03+05:30

వానలతో పాటు వ్యాధులూ వేధిస్తాయి. చల్లని వాతావరణాన్ని వ్యాధుల బారిన పడకుండా ఆస్వాదించాలంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వానలతో పాటు వ్యాధులూ వేధిస్తాయి. చల్లని వాతావరణాన్ని వ్యాధుల బారిన పడకుండా ఆస్వాదించాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే...


మర్దన!

ఆయుర్వేద కేలండర్‌లో వర్ష రుతువు నాల్గవది. తడి వాతావరణం శరీరంలో అసమతుల్యతలను కలిగిస్తుంది. ఫలితంగా అజీర్తి, కీళ్ల నొప్పులు వేధిస్తాయి. ఈ ఇబ్బందులను అధిగమించాలంటే నూనెతో కూడిన మర్దనలను ఆశ్రయించాలి. మర్దనవల్ల కణాలు ఉత్తేజితమై, రక్తప్రసరణ మెరుగుపడి జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే నాడుల మూలాలూ ప్రేరేపితమవుతాయి. శిరోధార మర్దన వల్ల కళ్లు సేద తీరి కమ్మని నిద్ర పడుతుంది. అయితే మర్దన కోసం వేర్వేరు నూనెలను కలిపి వాడాలి. 


వెచ్చగా, శుభ్రంగా... 

తేమతో కూడిన చల్లని వాతావరణం పలు రకాల శ్వాసకోశ, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లను కలిగిస్తుంది. కాబట్టి ఒంటిని వెచ్చగా ఉంచుకోవాలి. విటమిన్‌ ‘సి’ సప్లిమెంట్లు వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి. కాబట్టి వైద్యుల సూచన మేరకు వాటిని తీసుకోవాలి. ఈ వాతావరణంలో  హెపటైటిస్‌, టైఫాయిడ్‌లు విజృంభిస్తాయి. కాబట్టి కాచి చల్లార్చిన నీళ్లు, వేడి పదార్థాలు తీసుకోవాలి. వానలో తడిచిన వెంటనే స్నానం చేయాలి. 


వ్యాధినిరోధకశక్తి: వ్యాధినిరోధకశక్తిని పెంచడం కోసం శొంఠి పొడి, ధనియాల పొడి, ముతంగ, పతిముగం, కరింగాళిలను సమపాళ్లలో తీసుకుని ఒక లీటరు నీటిలో కలిపి పది నిమిషాల పాటు మరిగించాలి. చల్లారిన తర్వాత వడగట్టి రోజంతా నీటికి బదులుగా ఈ కషాయాన్ని తాగుతూ ఉండాలి.

చర్మ సమస్యలు: ఐదు నిమ్మ ఆకులు, చెరొక టీస్పూను పసుపు, కనికొన్న బెరడు తీసుకుని బక్కెటు నీళ్లలో వేసి ఆ నీటితో స్నానం చేయాలి.


ఇవి తినాలి... 

శరీర మెటబాలిజం (శక్తిని ఖర్చు చేసుకునే వేగం) ఈ కాలంలో తగ్గుతుంది. కాబట్టి మరీ వేడిగా లేదా మరీ చల్లగా ఉన్న ఆహారానికి దూరంగా ఉండాలి. ఇలాంటి ఆహారం జీర్ణశక్తిని కుంటుపరుస్తుంది. కాబట్టి వెచ్చగా ఉండే తాజా ఆహారాన్ని తీసుకోవాలి. మితంగా తినాలి. తేలికగా అరిగే పదార్థాలే తినాలి. వేపుళ్లు, కారం, ఉప్పు, మసాలాలు తగ్గించాలి. ఈ కాలంలో ఆకుకూరల వాడకం తగ్గించడం మేలు. ఎండబెట్టిన ఉసిరి, పుసుపు, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, కరివేపాకు వాడకం పెంచాలి. వీటితో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. 

Updated Date - 2022-08-23T18:00:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising