ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలొవెరాతో జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే వెంటనే ఇలా చేయండి!

ABN, First Publish Date - 2022-02-03T18:11:46+05:30

అలొవెరా అంటేనే.. మినరల్స్‌ హబ్‌. ఇందులో సి,ఇ, బి12 విటమిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ ఉంటుంది. వీటివల్ల జుట్టు రాలిపోతుండటం, చుండ్రు ఉండటం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(03-02-2022)

అలొవెరా అంటేనే.. మినరల్స్‌ హబ్‌. ఇందులో సి,ఇ, బి12 విటమిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ ఉంటుంది. వీటివల్ల జుట్టు రాలిపోతుండటం, చుండ్రు ఉండటం... లాంటి సమస్యలు తగ్గిపోతాయి. ఆరోగ్యానికి పవర్‌హౌస్‌లాంటి అలొవెరాతో జుట్టుకు ఎలాంటి మాస్క్‌లు వేసుకోవాలో తెలుసుకుందాం.


అలొవెరా జెల్‌, కొబ్బరినూనెను 2:3 నిష్పత్తిలో తీసుకుని బాగా కలపాలి. ఆ కలిపిన మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు తాకేట్లు పట్టించాలి. అరగంటపాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత శుభ్రపరచుకోవాలి. ఇలా తరచుగా ఈ హెయిర్‌ మాస్క్‌ వేసుకుంటే..  జుట్టులో చుండ్రు, రాలడం లాంటి సమస్యలు తగ్గిపోతాయి. 


అలొవెరా జెల్‌, పెరుగు, ఆలివ్‌ ఆయిల్‌ను 3:2:1 నిష్పత్తిలో తీసుకోవాలి. బాగా మిశ్రమం చేసి జుట్టుకు పట్టించి.. ఇరవై నిమిషాల తర్వాత క్లీన్‌ చేస్తే జుట్టు ముద్దగా ఉండకుండా.. పొడిగా తయారవుతుంది.


బౌల్‌లో ఒక కోడిగుడ్డు సొనను తీసుకుని అందులోకి మూడు స్పూన్ల తాజా అలొవెరా జెల్‌ను బ్రష్‌ సాయంతో బాగా మిక్స్‌ చేయాలి. 


ఈ ఎగ్‌మాస్క్‌ను వేశాక ఆ వాసన బయటికి రాకుండా షవర్‌ క్యాప్‌ ఉంచుకోవాలి. అరగంట తర్వాత మైల్డ్‌ షాంపుతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు బలంగా తయారవుతుంది.


నిద్రకు ముందు ఈ మాస్క్‌ వేసుకోవాలి. చిన్న కప్పు అలొవెరా జెల్‌, మెంతుల పిండితో పాటు ఆముదాన్ని రెండు టేబుల్‌ స్పూన్లు తీసుకోవాలి. బాగా కలిపిన తర్వాత జుట్టుకు వేసుకోవాలి. ఉదయాన్నే స్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు పెరుగుదల బాగా ఉంటుంది.


ఒక బౌల్‌లో తగినంత అలొవెరా జెల్‌ను తీసుకుని అందులోకి ఒక చిన్న మందారం పువ్వు పేస్ట్‌ను వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని పట్టించుకుంటే.. జుట్టులో బలంతో పాటు నిగనిగలాడుతుంది. 


అలొవెరా జెల్‌కి నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టిస్తే చుండ్రు వదిలిపోతుంది.

Updated Date - 2022-02-03T18:11:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising