ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్యాన్సర్లను ముందే గుర్తించే రక్తపరీక్ష

ABN, First Publish Date - 2022-09-14T20:09:00+05:30

క్యాన్సర్‌(Cancer).. తొలి దశలో ఎలాంటి లక్షణాలూ కనిపించకుండా లోపల్లోపల పెరిగే రాచపుండు! లక్షణాలు కనపడి క్యాన్సర్‌ బారిన పడ్డట్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘మల్టీ క్యాన్సర్‌ ఎర్లీ డిటెక్షన్‌’ టెస్టును రూపొందించిన ‘గ్రెయిల్‌’ శాస్త్రజ్ఞులు

క్యాన్సర్‌ మూలాన్ని 97 శాతం కచ్చితత్వంతో తెలుసుకునే అవకాశం


న్యూయార్క్‌, సెప్టెంబరు 13: క్యాన్సర్‌(Cancer).. తొలి దశలో ఎలాంటి లక్షణాలూ కనిపించకుండా లోపల్లోపల పెరిగే రాచపుండు! లక్షణాలు కనపడి క్యాన్సర్‌ బారిన పడ్డట్టు తెలుసుకునే సరికే అది రెండో దశలోనో, మూడు, నాలుగు దశల్లోనో ఉంటుంది. అలా కాకుండా ఎలాంటి లక్షణాలూ లేనప్పుడే.. శరీరంలో క్యాన్సర్‌ మహమ్మారి ఉన్నట్టు గుర్తించగలిగితే? అదీ సింపుల్‌ ఒక రక్తపరీక్ష ద్వారా గుర్తించే వీలుంటే? అద్భుతం కదూ..! అలాంటి ఒక అద్భుతమైన రక్తపరీక్షనే అందుబాటులోకి తెచ్చినట్టు ‘గ్రెయిల్‌’ అనే ఆరోగ్య సంరక్షణ సంస్థకు చెందిన శాస్త్రజ్ఞులు(Scientists) చెబుతున్నారు. ఆ పరీక్ష పేరు.. ‘మల్టీ క్యాన్సర్‌ ఎర్లీ డిటెక్షన్‌ (ఎంసీఈడీ)’ టెస్ట్‌.  ఈ పరీక్ష ఎంతవరకూ పనిచేస్తోందో తెలుసుకోవడానికి చేసిన అధ్యయనంలో 92 మందికి క్యాన్సర్‌ ఉన్న సంకేతాలు వచ్చాయి. మరిన్ని పరీక్షలు చేయగా.. వారిలో 35 మందికి 36 రకాల క్యాన్సర్లు ఉన్నట్టు వెల్లడైంది.  ఈ రక్తపరీక్ష ద్వారా 97% కచ్చితత్వంతో క్యాన్సర్‌ మూలాన్ని తెలుసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. 

Updated Date - 2022-09-14T20:09:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising