ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాకిస్తాన్ పేరెత్తితే మన ఆకలి తీరుతుందా?: ప్రియాంక

ABN, First Publish Date - 2022-02-20T21:44:12+05:30

కొంత మంది వేడిని తగ్గించడం గురించి మాట్లాడుతున్నారు. కొంత మంది పెరిగిన బరువును తగ్గించడం మాట్లాడుతున్నారు. కొంత మంది బుల్డోజర్లు నడుపుతున్నారు. కొంత మంది పాకిస్తాన్ పేరు ఎత్తుతున్నారు. ఇవి మాట్లాడితే మన కడుపు నింపుతుందా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ: ఎన్నికలు జరిగిన ప్రతీసారి ప్రజోపయోగం లేని చర్చలను తెరపైకి తెస్తున్నారని అధికార భారతీయ జనతా పార్టీపై ప్రియాంక గాంధీ వాద్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేక వారిని మభ్యపెట్టేందుకు ఇలాంటివి తెరపైకి తీసుకు వస్తున్నారని ఆమె మండి పడ్డారు. పాకిస్తాన్ పేరు తీస్తేనో బుల్డోజర్లు నడిపిస్తేనే ప్రజలు కడుపు నిండదని, ప్రజలకు అవసరమైన పనుల గురించి చర్చ జరగాలని ఆమె కోరారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం రాష్ట్రంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు.


‘‘కొంత మంది వేడిని తగ్గించడం గురించి మాట్లాడుతున్నారు. కొంత మంది పెరిగిన బరువును తగ్గించడం మాట్లాడుతున్నారు. కొంత మంది బుల్డోజర్లు నడుపుతున్నారు. కొంత మంది పాకిస్తాన్ పేరు ఎత్తుతున్నారు. ఇవి మాట్లాడితే మన కడుపు నింపుతుందా? పేదరికాన్ని ధ్వంసం చేస్తుందా? ఈ మాటల వల్ల కూలీ పనైనా దొరుకుతుందా? ఇలాంటి చర్చలు మాకు అవసరం లేదు. ప్రజల సమస్యల గురించి మాట్లాడండి’’ అని ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు.

Updated Date - 2022-02-20T21:44:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising