ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీ సీఎం యోగి కాదు భోగి...ఆదిత్యనాథ్‌పై మండిపడిన మమతా బెనర్జీ

ABN, First Publish Date - 2022-02-15T18:21:27+05:30

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ మండిపడ్డారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సన్యాసి కాదని భోగి అని మమతా ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యోగిపై విరుచుకుపడ్డారు.దేశ ప్రయోజనాల దృష్ట్యా తమ పార్టీ యూపీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించినట్లు మమతా చెప్పారు. అఖిలేష్ యాదవ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీ ప్రచారం కోసం మమతాబెనర్జీ యూపీకి వచ్చారు. ‘‘యూపీలో మహిళలను సజీవ దహనం చేస్తారు, రైతులను హతమారుస్తారు, యూపీ సీఎం యోగి కాదు భోగి, భారతదేశాన్ని రక్షించాలంటే మొదట యూపీని రక్షించాలి’’ అని బెనర్జీ అన్నారు. 


మొదటి దశ పోలింగులో అఖిలేష్ పార్టీ 57 సీట్లలో 37 సీట్లను గెలుచుకుంటుందని నేను ఆశిస్తున్నానని మమతా జోస్యం చెప్పారు.వారణాసిలో ర్యాలీ నిర్వహించేందుకు మార్చి 3న మరోసారి ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నట్లు పశ్చిమ బెంగాల్ సీఎం తెలిపారు.గోవా ఎన్నికల్లో తమ పార్టీ కూడా మంచి ఫలితాలు సాధిస్తుందని టీఎంసీ అధినేత్రి చెప్పారు.


Updated Date - 2022-02-15T18:21:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising