ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు : సాయంత్రం 5 గంటల వరకు 53 శాతం పోలింగ్

ABN, First Publish Date - 2022-03-03T23:41:27+05:30

ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో ఆరో విడత పోలింగ్ గురువారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో ఆరో విడత పోలింగ్ గురువారం జరిగింది. 10 జిల్లాల్లోని 57 నియోజకవర్గాల్లో గురువారం సాయంత్రం 5 గంటల వరకు 53.31 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా 676 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. 


యోగి ఆదిత్యనాథ్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. ఆయన గోరఖ్‌పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన గురువారం ఉదయం గోరఖ్‌పూర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  తమ్కుహి రాజ్ నుంచి ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు లల్లూ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి సమాజ్‌వాదీ పార్టీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్య ఫజిల్ నగర్ నుంచి ఎన్నికల బరిలో దిగారు. 


ఏడో దశ ఎన్నికలు జరిగే జౌన్‌పూర్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశంలోని నిరుపేదలను సాధికారులను చేయడానికి తన ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కోవిడ్ మహమ్మారి సమయంలో పేదలకు ఉచితంగా రేషన్ సరుకులను అందజేశామన్నారు. వ్యాక్సిన్లను ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. 


Updated Date - 2022-03-03T23:41:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising