sravanthi: కోమటిరెడ్డి... నమ్మకద్రోహం చేసేలా మాట్లాడటం బాధాకరం
ABN, First Publish Date - 2022-10-22T18:55:55+05:30
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy venkatreddy) తీరుపై చెప్పడానికి పదజాలం కూడా లేదని కాంగ్రెస్ అభ్యర్ధి స్రవంతి (Sravanthi) అన్నారు.
నల్గొండ: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy venkatreddy) తీరుపై చెప్పడానికి పదజాలం కూడా లేదని కాంగ్రెస్ అభ్యర్ధి స్రవంతి (Sravanthi) అన్నారు. శనివారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. సోదరిగా వెళ్లి అన్నా మీ ఆశీర్వాదం కావాలని ఎన్నోసార్లు కోరినా నమ్మకద్రోహం చేసేలా మాట్లాడటం బాధగా ఉందన్నారు. ధనబలానికి, ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతుంది మునుగోడు ఉప ఎన్నిక (Munugodu by poll) అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అందరూ కంకణబద్ధులై పనిచేస్తున్న సమయంలో ఇలా చేశారని అన్నారు. రేవంత్ రెడ్డి (Revanth reddy) వెనుక జరుగుతున్న కుట్రలకు నిదర్శనమే ఈ సంఘటనలని చెప్పుకొచ్చారు. మహిళా అభ్యర్థికి అవకాశం వచ్చిందని అంతా మీ వెంటే ఉండి గెలిపిస్తామని చెబుతున్నారని స్రవంతి (Munugodu congress canditate) తెలిపారు.
Updated Date - 2022-10-23T20:26:09+05:30 IST