ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీని గద్దె దించండి: మాయావతి

ABN, First Publish Date - 2022-02-20T20:55:17+05:30

ఉద్యోగాలిస్తామంటూ తప్పుడు వాగ్దానాలు చేసిన బీజేపీని గద్దె దింపాలని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ఉద్యోగాలిస్తామంటూ తప్పుడు వాగ్దానాలు చేసిన బీజేపీని గద్దె దింపాలని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి పిలుపునిచ్చారు. యూపీలో మూడో దశ పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో మాయావతి వరుస ట్వీట్లలో బీజేపీ అబద్ధపు వాగ్దానాలను ఎండగట్టారు. ఓటుతో అధికార పార్టీని తిప్పికొట్టాలని అన్నారు.


అధికార పార్టీ తప్పుడు విధానాల వల్ల పేద ప్రజలు మరింత పేద ప్రజలుగా మారారని, ఇంకెంతమాత్రం ఆ పార్టీని నమ్మాల్సిన పనిలేదని, బీఎస్‌పీ విశ్వసనీయమైన పార్టీ అని మరో ట్వీట్‌లో ఆమె పేర్కొన్నారు. ఉపాథి అవకాశాలు కల్పిస్తామని నమ్మించిన బీజేపీ ఆ పని చేయడానికి బదులు ఉన్న ఉద్యోగాలను కూడా ఊడలాక్కుందని ఆరోపించారు. ప్రజల జీవనానికి అవసరమైన ఉపాధి కల్పించాల్సిన తక్షణ ఆవశ్యకత ప్రస్తుత ప్రభుత్వాలపై ఉంటుందన్నారు. మూడో విడత ఎన్నికల్లో భాగంగా యూపీలోని 59 నియోజకవర్గాలకు ఆదివారం ఓటింగ్ జరుగుతోంది.

Updated Date - 2022-02-20T20:55:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising