ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Manipur కాంగ్రెస్, బీజేపీ ఘర్షణ

ABN, First Publish Date - 2022-02-28T18:27:45+05:30

మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ సోమవారం నాటి పోలింగ్ పర్వంలో హింసాకాండ జరిగింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంఫాల్ : మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో భాగంగా సోమవారం నాటి పోలింగ్ పర్వంలో హింసాకాండ జరిగింది.పోలింగ్ ప్రారంభమైన కొన్ని గంటల తర్వాత మణిపూర్‌లోని కీరావ్ నియోజకవర్గంలో రెండువర్గాలు రాళ్ల దాడికి దిగడంతో పోలీసులు కాల్పులు జరిపారు. పోలింగ్ బూత్ కబ్జా ఆరోపణలపై కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఘర్షణకు దిగాయి. కాంగ్‌పోక్పి జిల్లాలోని న్యూ కెయిథెల్‌మన్బి నియోజకవర్గంలో కూడా పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది.చురాచంద్‌పూర్‌లోని సింఘత్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా మాక్ పోల్ పరీక్షలో బీజేపీ కెపిఎ పక్షాల మధ్య ఘర్షణ చెలరేగడంతో హింస చెలరేగింది.ఈ ఘర్షణలో ఈవీఎం కంట్రోల్ యూనిట్ పాడైంది. రిటర్నింగ్ అధికారి బ్యాకప్ ఈవీఎం కోసం కాల్ చేశారు.


న్యూ కెయిథెల్‌మన్‌బిలో బీజేపీ కార్యకర్తలు బూత్‌ను స్వాధీనం చేసుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. దీంతో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు.ఘర్షణలో పాల్గొన్న జనాన్ని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు కాల్పులు జరపాల్సి వచ్చింది.ఘర్షణ జరగ్గా పోలీసులు నియంత్రించారని ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు.‘‘మణిపూర్‌లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 11:30 గంటలకు మొత్తం 27.3శాతం ఓటింగ్ నమోదైంది.’’అని ఈసీ అధికారులు చెప్పారు.

Updated Date - 2022-02-28T18:27:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising