ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీని ఓడించండి...యూపీ ఓటర్లకు మమతా బెనర్జీ పిలుపు

ABN, First Publish Date - 2022-02-08T14:32:44+05:30

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ వచ్చే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంగళవారం సమాజ్ వాదీ పార్టీ తరపున ప్రచారం చేయనున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ వచ్చే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంగళవారం సమాజ్ వాదీ పార్టీ తరపున ప్రచారం చేయనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆమె సోమవారం లక్నో వచ్చారు.సమాజ్‌వాదీ పార్టీ విజయం కోసం ప్రచారం చేసేందుకు తాను యూపీకి వచ్చానని లక్నోలో మమత అన్నారు.మంగళవారం లక్నోలోని పార్టీ కార్యాలయంలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో కలిసి బెనర్జీ సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రసంగించనున్నారు. టీఎంసీ చీఫ్ మమతాబెనర్జీ వర్చువల్ ర్యాలీలో కూడా ప్రసంగించనున్నారు.వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఓడించాలని మమతాబెనర్జీ పిలుపునిచ్చారు. 


ఎస్పీ తరపున ప్రచారం చేసేందుకు యాదవ్ తనను ఆహ్వానించారని లక్నోకు బయలుదేరే ముందు  ఆమె తెలిపారు.ఫిబ్రవరిలో తాను వారణాసిని సందర్శిస్తారని బెంగాల్ ముఖ్యమంత్రి చెప్పారు.ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పోటీ చేయదని, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అభ్యర్థులను బరిలోకి దింపుతుందని బెనర్జీ తెలిపారు.మమతాబెనర్జీ లక్నో రావడం మొదటిసారి కాదు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మమతా లక్నో నగరంలోని 1090 క్రాసింగ్ వద్ద నోట్ల రద్దు వ్యతిరేక బహిరంగ సభ నిర్వహించినప్పుడు ఎస్పీకి మద్దతుగా వచ్చారు. 


అప్పుడు యూపీ ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ ఉన్నారు.పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఎంసీ కోసం ప్రచారం చేయడానికి యాదవ్ ఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడు కిరణ్మయ్ నందా, ఎస్పీ రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్‌లను పంపారు.


Updated Date - 2022-02-08T14:32:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising