ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Akhlesh yadav: ఓట్లు వేయకుండా అడ్డుకుంటున్న పోలీసులు

ABN, First Publish Date - 2022-12-05T15:12:13+05:30

ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి పార్లమెంటరీ నియోజకవర్గం ఉప ఎన్నికకు సోమవారం ఓవైపు పోలింగ్ జరుగుతుండగా, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైన్‌పురి: ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి పార్లమెంటరీ నియోజకవర్గం ఉప ఎన్నికకు (Mainpuri bypolls) సోమవారం ఓవైపు పోలింగ్ జరుగుతుండగా, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav), ఆయన భార్య, ఎస్‌పీ అభ్యర్థి డింపుల్ యాదవ్ (Dimple Yadav) సంచలన ఆరోపణలు చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని అఖిలేష్ యాదవ్ ఆరోపించగా, ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతోందంటూ తమ కార్యకర్తల ఫిర్యాదులను అధికారులు రిసీప్ చేసుకోవడం లేదని డింపుల్ అన్నారు.

''పోలింగ్ మొదలైనప్పటికి నుంచి అధికార యంత్రాంగం ఎవరి ఆదేశాలపై పని చేస్తోందో నాకు అర్ధం కావడం లేదు. ఉదయం నుంచి ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఓటర్లను పోలీసులు అడ్డుకుంటున్నారు'' అని మీడియాకు అఖిలేష్ తెలిపారు. డింపుల్ సైతం అధికార ట్వటర్ ఖాతాలో మైన్‌పురి డీఎంపై విమర్శలు చేశారు. రిగ్గింగ్ జరుగుతోందంటూ కార్యకర్తలు చేస్తున్న ఫిర్యాదులను మైన్‌పురి డీఎం రిసీప్ చేసుకోవడం లేదని ట్వీట్ చేశారు.

కాగా, రాంపూర్ సదర్, ఖతౌలి అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ సోమవారం పోలింగ్ కొనసాగుతోంది. సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అజాంఖాన్, బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైని‌పై వేర్వేరు కేసులో అనర్హత వేటు పడటంతో ఈ రెండు చోట్ల ఉప ఎన్నిక జరుగుతోంది. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మృతితో మైన్‌పురి లోక్‌సభకు ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు.

Updated Date - 2022-12-05T15:12:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising