ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరీందర్‌ను తొలగించింది అందుకే: రాహుల్

ABN, First Publish Date - 2022-02-18T00:42:41+05:30

కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి ఎందుకు తొలగించామో చెప్పాలని వెల్లడించాలని అనుకుంటున్నాను. కాంగ్రెస్ ఎప్పుడూ పేద ప్రజల కోసం పని చేస్తుంది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఎంతో చేసింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను పంజాబ్ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడానికి గల కారణాన్ని రాహుల్ గాంధీ వెల్లడించారు. పంజాబ్ ప్రజలకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి అమరీందర్ విముఖత వ్యక్తం చేశారని, అంతే కాకుండా ప్రైవేటు విద్యుత్ కంపెనీలతో కాంట్రాక్టులు కుదుర్చుకున్నారని అందుకే ఆయనను సీఎం పదవి నుంచి తొలగించినట్లు ఆయన తెలిపారు. గురువారం రాష్ట్రంలోని ఫతేగఢ్‌ సాహిబ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ ప్రసంగిస్తూ అమరీందర్‌పై విమర్శలు గుప్పించారు.


‘‘కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి ఎందుకు తొలగించామో చెప్పాలని వెల్లడించాలని అనుకుంటున్నాను. కాంగ్రెస్ ఎప్పుడూ పేద ప్రజల కోసం పని చేస్తుంది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఎంతో చేసింది. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. ఇక ముందు శక్తి మేరకు చేస్తుంది. పంజాబ్‌లో పేద ప్రజలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కాంగ్రెస్ అనుకుంది. కానీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అందుకు ఒప్పుకోలేదు. తనకు విద్యుత్ కంపెనీలతో కాంట్రాక్టులు ఉన్నాయని ఆయన తెలిపారు. ఆయన మా పార్టీలో చాలా పెద్ద నేత. కానీ కాంగ్రెస్‌కు పేద ప్రజల ప్రయోజనాలే ముఖ్యం. అందుకే అమరీందర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాం’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

Updated Date - 2022-02-18T00:42:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising