ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోటీకి దూరం..కాంగ్రెస్‌తోనే ఉంటా: సునీల్ జాఖర్

ABN, First Publish Date - 2022-02-07T20:20:17+05:30

ఎన్నికల రాజకీయాలను విడిచిపెట్టినప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే తాను కొనసాగుతానని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లూధియానా: ఎన్నికల రాజకీయాలను విడిచిపెట్టినప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే తాను కొనసాగుతానని ఆ పార్టీ సీనియర్ నేత, పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖర్ తెలిపారు. తాను యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటానని గత ఐదు రోజుల నుంచి తాను చెబుతూనే ఉన్నానని, అయితే కాంగ్రెస్ పార్టీతోనే తాను మమేకమవుతానని ఆయన లూథియనాలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.


పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని రాహుల్ గాంధీ ప్రకటించడంపై సునీల్ జాఖర్ అభినందనలు కురిపించారు. ఇది చాలా గొప్ప నిర్ణయమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉందని, తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పంజాబ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్‌గా కూడా ఉన్న జాఖర్ తెలిపారు


కాగా, ఇటీవల కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించిన తర్వాత ఆ పదవిని జాఖర్ ఆశించారు. తనకు 42 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారని కూడా ఆయన పేర్కొన్న వీడియో సంచలనమైంది. తాను హిందువైనందునే తనను సీఎం అభ్యర్థిత్వం నుంచి తప్పించారని కూడా ఇటీవల ఆయన పేర్కొనడం కూడా పార్టీలో అసంతృప్తులు తలెత్తాయనే అభిప్రాయానికి తావిచ్చింది. ఆయన బీజేపీలో చేరవచ్చనే ఊహాగానాలు సైతం వినిపించాయి. అయితే, ఇందుకు భిన్నంగా చన్నీని సీఎం అభ్యర్థిగా  రాహుల్ ప్రకటించడాన్ని జాఖర్ స్వాగతించడం, కాంగ్రెస్ ఐక్యంగా ఉందని ప్రకటించడంతో పార్టీ వర్గాలు తేలిగ్గా ఊపిరిపీల్చుకున్నాయి.

Updated Date - 2022-02-07T20:20:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising