ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

uttarpradesh సీఎం యోగిపై మాజీ ఉపాధ్యాయుడి పోటీ

ABN, First Publish Date - 2022-02-05T14:13:08+05:30

అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న మాజీ ఉపాధ్యాయుడు విజయ్ సింగ్ సాక్షాత్తూ యూపీ సీఎం అయిన గోరఖ్‌పూర్ భాజపా అభ్యర్థి యోగి ఆదిత్యనాథ్ పై ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోరఖ్‌పూర్(ఉత్తరప్రదేశ్): అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న మాజీ ఉపాధ్యాయుడు విజయ్ సింగ్ సాక్షాత్తూ యూపీ సీఎం అయిన గోరఖ్‌పూర్ భాజపా అభ్యర్థి యోగి ఆదిత్యనాథ్ పై ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. అవినీతికి వ్యతిరేకంగా భూ మాఫియాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ ఉపాధ్యాయుడైన విజయ్ సింగ్ ముజఫర్‌నగర్‌లో 26 ఏళ్లుగా ధర్నా చేస్తున్నాడు.తాను గోరఖ్‌పూర్ అర్బన్ స్థానం నుంచి యోగి ఆదిత్యనాథ్‌పై పోటీ చేస్తానని, కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అఖిలేష్ యాదవ్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని విజయ్ సింగ్ చెప్పారు. విజయ్ సింగ్ అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో వేలాది ఎకరాల భూమిని ఆక్రమించిన ల్యాండ్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముజఫర్‌నగర్‌లో 26 ఏళ్లుగా ధర్నా చేస్తున్నాడు.


‘‘నేను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించాను. నేను ఫిబ్రవరి 9న గోరఖ్‌పూర్ అర్బన్ స్థానం నుంచి పోటీకి నామినేషన్ దాఖలు చేస్తాను’’ అని విజయ్ సింగ్ చెప్పారు.‘‘గత 26 ఏళ్లుగా ఉత్తరప్రదేశ్‌ను పాలించిన ఏ పార్టీ కూడా అవినీతికి వ్యతిరేకంగా, భూ మాఫియాపై చర్యలు తీసుకోవడంలో సీరియస్‌గా లేదని ప్రజలకు తెలియజేసేందుకు నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను’’ అని విజయ్ సింగ్ వెల్లడించారు. 

Updated Date - 2022-02-05T14:13:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising