ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ మూడు రాష్ట్రాల సీఎంలకు షాక్ తగలనుందా?

ABN, First Publish Date - 2022-03-10T17:50:22+05:30

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అత్యంత ఉత్కంఠగా కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అత్యంత ఉత్కంఠగా కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఇటీవల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు (గురువారం) కౌంటింగ్ జరుగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్‌లలో బీజేపీ ముందంజలో ఉంది. పంజాబ్‌లో ఆప్ ఆధిక్యంలో ఉంది. 


కాగా, ఈ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు షాకింగ్ ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్.. సాక్విలిమ్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ధర్మేశ్ కంటే వెనుకంజలో ఉన్నారు. ఇక, పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఈ రెండు చోట్లా చన్నీ కంటే ఆప్ అభ్యర్థులే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ఖతిమా నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కంటే వెనుకంజలో ఉన్నారు. 

Updated Date - 2022-03-10T17:50:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising