ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాకా పోయినట్లే బాబా పోతారు: యోగిపై అఖిలేష్ విమర్శలు

ABN, First Publish Date - 2022-02-20T23:55:26+05:30

బీజేపీ నేతలు ఇప్పుడిప్పుడే ఎబీసీడీలు నేర్చుకుంటున్నారు. అయితే నేను వారికి ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. కాకా ఎలాగైతే వెళ్లారో బాబా కూడా అలాగే వెళ్తారు (మోదీ వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ)..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో యోగి ప్రభుత్వం ఓడిపోతుందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న విషయాన్ని అఖిలేష్ గుర్తు చేస్తూ.. యోగి సైతం అలాగే ఇంటికి వెళ్తారని ఎద్దేవా చేశారు. ఆదివారం అయోధ్యలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అఖిలేష్ మాట్లాడుతూ రాబోయేది తమ ప్రభుత్వమేనని, ఇప్పటికే జరిగిన రెండు దశల పోలింగ్‌లో 100 సీట్లు గెలిచామని అన్నారు.


‘‘బీజేపీ నేతలు ఇప్పుడిప్పుడే ఎబీసీడీలు నేర్చుకుంటున్నారు. అయితే నేను వారికి ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. కాకా ఎలాగైతే వెళ్లారో బాబా కూడా అలాగే వెళ్తారు (మోదీ వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ), యోగి అన్నింటి పేర్లు మారుస్తుంటారు. ఇప్పుడు ఆయన పేరు కూడా మార్చుకోవాలి. బుల్డోజర్లు నడిపిస్తామని చెప్తున్న ఆయనకు బాబా బుల్డోజర్ అని పేరు మార్చాలి’’ అని అఖిలేష్ అన్నారు.


అఖిలేష్ ఈరోజు ఓటు వేశారు. అఖిలేష్ పోటీ చేస్తున్న కర్హాల్ నియోజకవర్గంలో కూడా ఇదే రోజు పోలింగ్ జరగడం విశేషం. ఈ విషయాన్ని అఖిలేష్ గుర్తు చేస్తూ ‘‘నేను నా ఓటును వినియోగించుకున్నాను. అలాగే ఓటర్లందరికీ నేను విజ్ణప్తి చేస్తున్నాను. సైకిల్ గుర్తుకు ఓటేయండి. మంచి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని నాకు తెలుసు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య, రాజ్యాంగ గొప్పతనాన్ని చాటి చెప్పనున్నాయి’’ అని అఖిలేష్ అన్నారు.

Updated Date - 2022-02-20T23:55:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising