ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీఐపీ సంప్రదాయాన్ని ఈఐపీగా మార్చాం: రాజ్‌నాథ్

ABN, First Publish Date - 2022-01-30T18:18:02+05:30

అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఆదివారం రాష్ట్రంలోని కాస్‌గంజ్‌లో నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలు కొన్ని సంవత్సరాల నుంచి చేసిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక అనేక మార్పులు చోటు చేసుకున్నాయని, ప్రతి పౌరునికి రాష్ట్రంలో గుర్తింపు లభించిందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇప్పటి వరకు ఉన్న వీఐపీ (వెరీ ఇంపార్టెంట్ పర్సన్) సంప్రదాయాన్ని తాము ఈఐపీగా (ఎవరీ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్) మార్చామని ఆయన పేర్కొన్నారు. ఐదేళ్ల తమ పాలనలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి జరిగిందని రానున్న కాలంలో మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. ‘సబ్‌ కా సాత్.. సబ్‌ కా వికాస్.. సబ్ కా విశ్వాస్’ నినాదంతో పాలన చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీయేనని రాజ్‌నాథ్ అన్నారు.


అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఆదివారం రాష్ట్రంలోని కాస్‌గంజ్‌లో నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలు కొన్ని సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధిని బీజేపీ ఐదేళ్లలో చేసి చూపించింది. ఈ ఐదేళ్లలో యూపీ వేగవంతమైన అభివృద్ధిని చూసింది. అంతే కాకుండా ఇప్పటి వరకు ఉన్న వీఐపీ సంప్రదాయాన్ని ఈఐపీగా బీజేపీ మార్చేసింది’’ అని అన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ మధ్య ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మార్చి 10న విడుదల చేయనున్నారు.

Updated Date - 2022-01-30T18:18:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising