ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీ రాష్ట్రం కశ్మీర్, బెంగాల్‌లా కాకుండా ఓటర్లు జాగ్రత్త పడాలి...

ABN, First Publish Date - 2022-02-10T16:00:34+05:30

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ సందర్భంగా బీజేపీ సీఎం అభ్యర్థి యోగి ఆదిత్యనాథ్ ఓటర్లకు హెచ్చరించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు

లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ సందర్భంగా బీజేపీ సీఎం అభ్యర్థి యోగి ఆదిత్యనాథ్ ఓటర్లకు హెచ్చరించారు. ఓటర్లు తప్పు చేస్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కశ్మీర్, కేరళ లేదా బెంగాల్‌గా మారుతుందని యోగి వ్యాఖ్యానించారు. యూపీ రాష్ట్రంలో మొదటి రౌండ్ ఎన్నికలకు కొన్ని గంటల ముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు.బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను యోగి కోరారు.బీజేపీకి ఓటు వేస్తే భయరహిత జీవితానికి హామీ అని ఉత్తరప్రదేశ్ బీజేపీ ట్విట్టర్‌లో యోగి ఆదిత్యనాథ్ వీడియోను షేర్ చేశారు. 11 నెలలపాటు రైతుల నిరసన కేంద్రమైన పశ్చిమ ప్రాంతంలోని 58 నియోజకవర్గాల్లో గురువారం ఓటింగ్ జరుగుతోంది.


‘‘నా మనసులో ఉన్న విషయం మీకు చెప్పాలి. ఈ ఐదేళ్లలో చాలా అద్భుతాలు జరిగాయి. జాగ్రత్త! తప్పితే ఈ ఐదేళ్ల శ్రమ చెడిపోతుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కశ్మీర్, కేరళ, బెంగాల్‌గా మారుతుందని యోగి ఆదిత్యనాథ్ వీడియోలో పేర్కొన్నారు.‘‘ఐదేళ్ల నా శ్రమకు మీ ఓటు దీవెన.. మీ ఓటు కూడా మీ నిర్భయ జీవితానికి గ్యారెంటీ’’ అని యోగి వివరించారు. యోగి ఆదిత్యనాథ్ యూపీలో రెండోసారి అధికారం కోసం ప్రయత్నిస్తున్నారు.సీఎం యోగికి మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ తన ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు.

Updated Date - 2022-02-10T16:00:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising