ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోవాలో బీజేపీకి 22కుపైగా సీట్లు : అమిత్ షా జోస్యం

ABN, First Publish Date - 2022-01-30T23:35:14+05:30

గోవా శాసన సభ ఎన్నికల్లో బీజేపీ 22కుపైగా స్థానాలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పనజీ : గోవా శాసన సభ ఎన్నికల్లో బీజేపీ 22కుపైగా స్థానాలను గెలుచుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. పోండాలో ఆదివారం జరిగిన  ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, గోవాను కాంగ్రెస్ ఓ వెకేషన్ స్పాట్‌గా చూస్తోందన్నారు. కానీ బీజేపీ మాత్రం గోవాను సువర్ణ గోవాగా చూస్తోందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడటానికి పూర్వం గోవాలో అస్థిరత ఉండేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అభివృద్ధి ప్రభంజనాన్ని ప్రారంభించామన్నారు. 


గోవా రాజకీయాల్లోకి చాలా పార్టీలు ఎందుకు ప్రవేశించాయో తనకు అర్థం కావడం లేదన్నారు. టీఎంసీ, ఆప్ గోవాను అభివృద్ధి చేయగలవా? అని ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలను ఆ పార్టీలు అర్థం చేసుకోగలవా? అని అడిగారు. 


అంతకుముందు ఆయన బోరిమ్‌లో సాయిబాబా టెంపుల్‌లో ప్రార్థనలు చేశారు. ఆయనతోపాటు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కూడా ఉన్నారు. 


40 స్థానాలున్న గోవా శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 14న జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది. 


Updated Date - 2022-01-30T23:35:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising