ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌ పాలనలో నిరుద్యోగం నాలుగింతలు

ABN, First Publish Date - 2022-08-17T21:00:21+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్‌(Chief Minister KCR) పాలనలో రాష్ట్రంలో నిరుద్యోగం నాలుగింతలు పెరిగిందని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల(YS Sharmila) మంగళవారం ధ్వజమెత్తారు. ఆమె పాదయాత్ర నారాయణపేట జిల్లా ఊట్కూర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉద్యోగాలు రాక వందలాదిమంది ఆత్మహత్యలు

ప్రభుత్వంపై వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజం


నారాయణపేట టౌన్‌, ఆగస్టు 16: ముఖ్యమంత్రి కేసీఆర్‌(Chief Minister KCR) పాలనలో రాష్ట్రంలో నిరుద్యోగం నాలుగింతలు పెరిగిందని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల(YS Sharmila) మంగళవారం ధ్వజమెత్తారు. ఆమె పాదయాత్ర నారాయణపేట జిల్లా ఊట్కూర్‌ మండలం నిడుగూర్తికి చేరింది. ఈ సందర్భంగా వైఎస్‌ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ‘‘దున్నపోతుపై వానపడినట్లుగా ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి విధానం. ఎనిమిదేళ్లుగా తెలంగాణ లో ప్రతివర్గాన్నీ కేసీఆర్‌ మోసం చేశారు. సీఎం అనుకుంటే 1.91 లక్షల ఉద్యోగాలకు నోటిఫికే షన్‌ ఇవ్వవచ్చు. ఎనిమిదేళ్ల తర్వాత నోటిఫికేషన్లు వేసి తీవ్రస్థాయిలో పోటీ ఉండేలా చేశారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు కేసీఆర్‌ చేస్తున్న హత్యలే. ఉద్యమంలో రాష్ట్రం వస్తే మన ఉద్యోగాలు మనకే అన్నారు. రాష్ట్రం వ చ్చింది. మరి మన ఉద్యోగాలు ఎక్కడ? ఉద్యమ సమయంలో గ్రూప్‌ -1 నోటిఫికేషన్‌ వస్తే రాయవద్దని చెప్పారు. మరి కొత్త రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతున్నా గ్రూప్‌ -1 నోటిఫికేషన్‌ ఎందుకు లేదు? 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ అని చెప్పి ఇప్పటి వరకు కేవలం 17 వేల కొలువులకు మాత్రమే నోటిఫికేషన్‌ ఇచ్చారు కేసీఆర్‌ దిక్కుమాలిన పాలనలో 8వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి వడ్డీలను కట్టిస్తున్నారు. మీరిచ్చే రైతుబంధు రూ. 5 వేలు బ్యాంకులకు వడ్డీ కట్టడానికే సరిపోతుంది. ఉద్యమంలో తాను తన భార్య అని చెప్పిన కేసీఆర్‌, రాష్ట్రం వచ్చాక కుటుంబం మొత్తాన్ని దించేశారు. ఈ బంగారు తెలంగాణ లో కనీసం విద్యార్థులకు కడుపునిండా భోజనం పెట్టే దిక్కు లేకుండా పోయింది. ఈ ప్రభుత్వానికి ఉద్యోగాలు ఇవ్వడం చేతకాకుంటే వెంటనే నిరుద్యోగ భృతి చెల్లించాలి’’ అని షర్మిల డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-08-17T21:00:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising