ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంగ్ల మాధ్యమంతో ఇబ్బందులేనన్న వైసీపీ ఎమ్మెల్సీ

ABN, First Publish Date - 2022-07-02T17:32:39+05:30

మనిషి ఆలోచనలు మాతృభాషలోనే పరిఢవిల్లుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఇంగ్లిషు మీడియం ట్రెండ్‌ నడుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు చేయడం వల్ల భవిష్యత్‌లో విద్యార్థులకు అటు తెలుగు రాక, ఇటు ఇంగ్లిషు రాక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంగ్ల మాధ్యమంతో అగచాట్లే.. మా అధికారులకు ఇదే చెప్పా: డొక్కా 


హైదరాబాద్‌ సిటీ, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ‘‘మనిషి ఆలోచనలు మాతృభాషలోనే పరిఢవిల్లుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఇంగ్లిషు మీడియం ట్రెండ్‌ నడుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు చేయడం వల్ల భవిష్యత్‌లో విద్యార్థులకు అటు తెలుగు రాక, ఇటు ఇంగ్లిషు రాక ఇబ్బందిపడే ప్రమాదముంది. ఇదే అభిప్రాయాన్ని నేను విద్యా శాఖ అధికారులకు తెలియజేశాను’’ అని వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అన్నారు. ప్రముఖ భాషావేత్త చేకూరి రామారావు (చేరా) సర్వలభ్య రచనలను మనసు ఫౌండేషన్‌ నాలుగు సంపుటాలుగా ప్రచురించింది. చేరా జయంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని తెలుగు వర్సిటీలో ఆ పుస్తకాలను ఆయన జీవిత భాగస్వామి చేకూరి రంగనాయకి ఆవిష్కరించారు. తొలి ప్రతిని విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యురాలు తుమ్మల కృష్ణాబాయికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డొక్కా మాణిక్యవరప్రసాద్‌ తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంగ్ల మాధ్యమ విధానాన్ని పరోక్షంగా విమర్శించడంతో సభికులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. తన అభిప్రాయాన్ని వెల్లడించినందుకు ఆయన్ను అభినందించారు.

Updated Date - 2022-07-02T17:32:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising