ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపే పోలీస్‌ ఉద్యోగాలకు రాత పరీక్ష

ABN, First Publish Date - 2022-08-06T19:39:03+05:30

పోలీస్‌ శాఖ(Police Department)లో ఎస్సై పోస్టుల భర్తీకి రాత పరీక్ష ఆదివారం జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ శాఖ(Police Department)లో ఎస్సై పోస్టుల భర్తీకి రాత పరీక్ష ఆదివారం జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనున్న ఈ పరీక్ష కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 554 ఎస్సై పోస్టుల(SI posts)కు గాను రాష్ట్ర వ్యాప్తంగా 2,47,217 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు 446 మంది పోటీ పడుతున్నారు. రాత పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 538 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 


నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ: సీపీ సీవీ ఆనంద్‌

పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని సీపీ సీవీ ఆనంద్‌(CP CV Anand) స్పష్టం చేశారు. ఆదివారం పరీక్ష జరగనున్న నేపథ్యంలో ఆయన.. అభ్యర్థులకు పలు సలహాలు, సూచనలు అందించారు. విద్యార్థులు 9 గంటలకల్లా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. 

Updated Date - 2022-08-06T19:39:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising