ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెడ్డి రాజ్యంలో పని చేయలేను.. JNTU సూపరింటెండెంట్‌ ఆవేదన

ABN, First Publish Date - 2022-08-10T16:18:00+05:30

రెడ్డిరాజ్యంలో ఉద్యోగం చేయలేకపోతున్నానని అనంతపురం నుంచి కలికిరి జేఎన్‌టీయూ(JNTU)కి బదిలీపై వెళ్లిన సూపరింటెండెంట్‌ ఎండీ నాగభూషణం(Superintendent MD Nagabhushanam) ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

త్వరలో వీఆర్‌ఎస్‌ తీసుకుంటా

కలికిరి జేఎన్‌టీయూ సూపరింటెండెంట్‌ నాగభూషణం


అనంతపురం, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): రెడ్డిరాజ్యంలో ఉద్యోగం చేయలేకపోతున్నానని అనంతపురం నుంచి కలికిరి జేఎన్‌టీయూ(JNTU)కి బదిలీపై వెళ్లిన సూపరింటెండెంట్‌ ఎండీ నాగభూషణం(Superintendent MD Nagabhushanam) ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన మంగళవారం ప్రకటనతోపాటు వాట్సాప్‌ వీడియో విడుదల చేశారు. అనంతపురం జేఎన్‌టీయూలో పని చేస్తున్న తనను వైసీపీ విద్యార్థి సంఘం ఫిర్యాదు మేరకు కలికిరి జేఎన్‌టీయూకి బదిలీ చేశారన్నారు. అనంతపురంలో ఉద్యోగోన్నతి పొందిన తర్వాతే బదిలీ చేయడం ఆనవాయితీ అని, దానిని తుంగలో తొక్కి ఉద్దేశపూర్వకంగా తనను బదిలీ చేశారని వాపోయారు. బలహీనవర్గానికి చెందిన తాను రిజర్వేషన్‌ ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తుండటాన్ని ఆ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయని చెప్పారు. తన భార్య ఉద్యోగిగా ఉన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా 250 కిలోమీటర్ల దూరంలోని కలికిరి బదిలీ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. కలికిరి జేఎన్‌టీయూలో సూపరింటెండెంట్‌ పోస్టు లేకపోయినా అక్కడికి బదిలీ చేశారని, తన ఆరోగ్యం బాగోలేదని చెప్పినా పట్టించుకోలేదన్నారు.

Updated Date - 2022-08-10T16:18:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising