ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక వైపు జ్వరపీడితులు.. మరోవైపు తరగతులు

ABN, First Publish Date - 2022-08-05T17:25:29+05:30

ఒకవైపు జ్వరంతో బాధపడుతూ మంచం పట్టిన చిన్నారులు... మరోవైపు చదువుకుంటున్న విద్యార్థులు. ఈ దృశ్యం పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం రావికోన గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలోనిది. ఇక్కడ 3 నుంచి పదో తరగతి వరకూ 154 మంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్వతీపురం రూరల్‌: ఒకవైపు జ్వరంతో బాధపడుతూ మంచం పట్టిన చిన్నారులు... మరోవైపు చదువుకుంటున్న విద్యార్థులు(students). ఈ దృశ్యం పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం రావికోన గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల(Tribal Welfare Ashram School)లోనిది. ఇక్కడ 3 నుంచి పదో తరగతి వరకూ 154 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ వసతి సమస్య తీవ్రంగా ఉంది. అరకొరగానే గదులు ఉన్నాయి. ఏడు గదులకుగాను మూడింటిని నిర్వహణకు వినియోగిస్తున్నారు. మిగతా నాలుగు గదుల్లో విద్యార్థులకు వసతితో పాటు తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కొందరు విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్నారు. అయితే వసతి సమస్య కారణంగా ఒక గదిలోనే జ్వరపీడితులు విశ్రాంతి తీసుకుంటుండగా.. మిగతా విద్యార్థులు చదువుకుంటూ కనిపించారు. దీనిపై హెచ్‌ఎం సోమన్నదొర వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా కొత్తగా భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరయ్యాయని చెప్పారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు.

Updated Date - 2022-08-05T17:25:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising