ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గురుకుల కళాశాలలో గొడవ.. ముగ్గురికి టీసీలు

ABN, First Publish Date - 2022-08-04T17:45:53+05:30

నగర శివారు కల్వంచ శాంతినగర్‌లోని మైనారిటీ గురుకుల(Minority Gurukul) బాలుర కళాశాల, పాఠశాలలో టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థుల మధ్య గొడవ(students fight) వివాదానికి దారి తీసింది. పేరు చెప్పాలని, పాటలు పాడాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముగ్గురు విద్యార్థులకు టీసీలు ఇచ్చిన ప్రిన్సిపాల్‌

పిల్లల్ని కొట్టి పంపారని విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోపణ

ర్యాగింగ్‌ చేశారని ఆరోపణ?


హయత్‌నగర్‌/వనస్థలిపురం, హైదరాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): నగర శివారు కల్వంచ శాంతినగర్‌లోని మైనారిటీ గురుకుల(Minority Gurukul) బాలుర కళాశాల, పాఠశాలలో టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థుల మధ్య గొడవ(students fight) వివాదానికి దారి తీసింది. పేరు చెప్పాలని, పాటలు పాడాలని ఇంటర్‌ విద్యార్థులు దాడి చేశారని టెన్త్‌ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీంతో ముగ్గురు విద్యార్థులకు ప్రిన్సిపాల్‌(Principal) టీసీ ఇచ్చి ఇంటికి పంపించారు. మరి కొంతమందిని హెచ్చరించి వదిలేశారు. అయితే, పిల్లలను ఇంటికి పంపించడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను కొట్టి, టీసీ(tc) ఇచ్చి పంపించారని ఆరోపిస్తున్నారు. వారి ప్రవర్తన సరిగాలేకే చర్యలు తీసుకున్నట్లు ఉపాధ్యాయులు(Teachers) చెబుతున్నారు.


ర్యాగింగ్‌ చేస్తున్నారు..

కొంత మంది విద్యార్థులు తమను ర్యాగింగ్‌(Raging) చేస్తున్నట్లు పదో తరగతి విద్యార్థులు వాపోతున్నారు. తాము ఆడుకుంటుండగా కొందరు తమపై దాడి చేశారని పదో తరగతి విద్యార్థి యోగేష్‌, ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న షేక్‌ హసన్‌ మీడియాకు వివరించారు. దాడిలో కుడికన్నుకు గాయమైనట్లు యోగేష్‌ చూపించారు. కొందరు ఇంటర్‌ విద్యార్థులు సెల్‌ఫోన్‌ చూస్తుండగా టెన్త్‌ విద్యార్థులు అభ్యంతరం చెప్పడం వివాదానికి కారణమని, ఈ విషయమై మంగళవారం రాత్రి ఇరువర్గాలూ కొట్టుకున్నట్లు హాస్టల్‌ యజమాని(Hostel owner) ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. 


ప్రవర్తన సరిగా లేనందునే..

చిన్న తరగతి విద్యార్థులను ర్యాగింగ్‌ చేయడం, కొట్టడంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తించినందుకు ఇంటర్‌ విద్యార్థులు ముగ్గురికి టీసీ ఇచ్చిన మాట వాస్తవమే అని ప్రిన్సిపాల్‌ పి. నిర్మల తెలిపారు. గతంలోనే వారి తల్లిదండ్రుల(parents)ను  పిలిచి హెచ్చరించినా ప్రవర్తనలో మార్పు లేదన్నారు. విద్యార్థులను కొట్టలేదన్నారు. ప్రవర్తన సరిగాలేని 10వ తరగతి విద్యార్థులకు కూడా టీసీ ఇస్తామని బెదిరించామని అన్నారు. ప్రస్తుతం కళాశాలలో ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయని 144 సెక్షన్‌ అమల్లో ఉన్నప్పటికీ కొందరు కళాశాలలోనికి వచ్చి సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. 

Updated Date - 2022-08-04T17:45:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising