ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

109 ఎంసెట్‌ కేంద్రాలు.. ఈ నెల 14 నుంచి ప్రవేశ పరీక్ష ప్రారంభం

ABN, First Publish Date - 2022-07-05T20:59:16+05:30

ఈ ఏడాది ఇంజనీరింగ్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎంసెట్‌) నిర్వహణ కేంద్రాల సంఖ్యను పెంచారు. గత ఏడాది కంటే అదనంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌/కేయూ క్యాంపస్‌, జూలై 4(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఇంజనీరింగ్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(Engineering and Medical Common Entrance Test) (ఎంసెట్‌) నిర్వహణ కేంద్రాల సంఖ్యను పెంచారు. గత ఏడాది కంటే అదనంగా ఐదు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో 85, ఏపీలో 24 సెంటర్లలో పరీక్ష జరుపనున్నారు. ఈ నెల 14న ప్రారంభమై.. 15, 18, 19, 20 తేదీల్లో జరిగే ఎంసెట్‌కు అఽధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. 14, 15వ తేదీల్లో అగ్రి, 18, 19, 20వ తేదీల్లో ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ను నిర్వహించనున్నారు. ఉదయం సెషన్‌ పరీక్ష 9 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం సెషన్‌ 3 నుంచి 6 గంటల వరకు జరుగనుంది. రాష్ట్రంలో ఎంసెట్‌కు 2.66 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 


ఈ ఏడాది ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీని రద్దు చేశారు. 70 శాతం సిలబస్‌తోనే ఎంసెట్‌లో ప్రశ్నలను ఇవ్వనున్నారు. ఇక, జూలైలో వరుసగా వివిధ ప్రవేశ పరీక్షలున్నాయి. 13న ఈసెట్‌, అనంతరం ఎంసెట్‌, లాసెట్‌, ఎడ్‌ సెట్‌, ఐసెట్‌, సీపీ గెట్‌ నిర్వహించనున్నారు. ఈ నెల 20న జరిగే కామన్‌ పీజీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(సీపీజీఈటీ)కు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు గడువు సోమవారంతో ముగిసింది. రూ.500 ఫైన్‌తో ఈ నెల 11 దాకా, రూ.2 వేల ఫైన్‌తో ఈ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్‌ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే జేఈఈ వంటి ప్రవేశ పరీక్షలు కూడా ఈ నెలలోనే ఉన్నాయి. ఇప్పటికే జేఈఈ మెయిన్‌ సెషన్‌-1ను పూర్తి చేశారు. ఈ నెల 21 నుంచి 30 వరకు సెషన్‌-2ను నిర్వహించనున్నారు. జేఈఈ అడ్వాన్స్‌  ఆగస్టు 28న జరుగనుంది. సెప్టెంబరు 11న జేఈఈ అడ్వాన్స్‌ ఫలితాలను ప్రకటించనున్నారు. 


ఐసెట్‌కు అపరాధ రుసుము తగ్గింపు..

ఐసెట్‌ను ఈ నెల 27, 28న నిర్వహించనున్నారు. రూ.250 అపరాధ రుసుముతో 14వ తేదీ వరకు, రూ.500తో ఈ నెల 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటిదాకా రూ.250 ఫైన్‌తో ఈ నెల 11 దాకా, రూ.500తో 18 దాకా, రూ.1000తో ఈ నెల 23వ తేదీ వరకు అవకాశం ఉంది.



Updated Date - 2022-07-05T20:59:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising