ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

13 జిల్లాల్లో ‘స్పౌజ్‌’ బదిలీలు చేపట్టాలి.. ప్లకార్డులతో టీచర్ల నిరసన

ABN, First Publish Date - 2022-01-18T22:38:54+05:30

రాష్ట్రంలో 13 జిల్లాల్లో పలు కారణాలతో ఉపాధ్యాయ దంపతుల బదిలీలు చేపట్టలేదని ఆయా జిల్లాల టీచర్లు మండిపడ్డారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పంజాగుట్ట, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 13 జిల్లాల్లో పలు కారణాలతో ఉపాధ్యాయ దంపతుల బదిలీలు చేపట్టలేదని ఆయా జిల్లాల టీచర్లు మండిపడ్డారు. ఉపాధ్యాయ దంపతులు ఒకే ప్రాంతంలో పనిచేసేలా బదిలీలు చేపట్టి తమను ఆదుకోవాలని 13 జిల్లాల ఉపాధ్యాయ దంపతుల యూనియన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని ఆ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆ యూనియన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఉపాధ్యాయులు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళతారని భావించిన పోలీసులు ప్రెస్‌క్లబ్‌ వద్ద భారీగా మోహరించారు. ప్రెస్‌క్లబ్‌ నుంచి చాలాసేపటివరకు ఎవరినీ బయటికి వెళ్లనివ్వలేదు. దీంతో ఉపాధ్యాయులు అక్కడే నిరసన తెలిపారు.

Updated Date - 2022-01-18T22:38:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising