ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులకు షాక్! ఫీజులు పెరిగాయ్‌!

ABN, First Publish Date - 2022-10-04T18:48:21+05:30

ఇంజనీరింగ్‌ కోర్సుల(Engineering courses)కు కనిష్ఠ, గరిష్ఠ ఫీజులపై ‘తెలంగాణ రాష్ట్ర ప్రవేశాలు, ఫీజు నియంత్రణ కమిటీ (టీఎఫ్ఏఆర్సీ)’ కసరత్తు పూర్తయింది. కనిష్ఠ ఫీజు రూ.45 వేలు, గరిష్ఠంగా రూ.1.60 లక్షలుగా నిర్ణయించినట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కనిష్ఠం 45 వేలు.. గరిష్ఠం 1.60 లక్షలు!

ఇంజనీరింగ్‌ ఫీజులపై టీఏఎఫ్ఆర్సీ నిర్ణయం

ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక


హైదరాబాద్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ కోర్సుల(Engineering courses)కు కనిష్ఠ, గరిష్ఠ ఫీజులపై ‘తెలంగాణ రాష్ట్ర ప్రవేశాలు, ఫీజు నియంత్రణ కమిటీ (టీఎఫ్ఏఆర్సీ)’ కసరత్తు పూర్తయింది. కనిష్ఠ ఫీజు రూ.45 వేలు, గరిష్ఠంగా రూ.1.60 లక్షలుగా నిర్ణయించినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. అనంతరం ఫీజుల పెంపుపై ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయనుంది. ప్రస్తుతం ఖరారు చేస్తున్న ఫీజులు ఈ ఏడాది నుంచి వచ్చే మూడేళ్ల కాలానికి అమలులో ఉంటాయి. ఈ ఫీజులను ఖరారు చేయడానికి సోమవారం టీఏఎ్‌ఫఆర్సీ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. కమిటీ ఛైర్మన్‌ జస్టిస్‌ స్వరూప్‌రెడ్డి ఆధ్యర్వంలో జరిగినఈ సమావేశంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కొన్ని ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపారు. అనంతరం ఫీజులపై తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇంజనీరింగ్‌ కోర్సులకు ఇప్పటి వరకు కనీస ఫీజు రూ.35 వేలుగా ఉంది.


తాజాగా దీన్ని రూ.45 వేలకు పెంచారు. అలాగే రూ.1.43 లక్షలుగా ఉన్న గరిష్ఠ ఫీజును రూ.1.60 లక్షలకు పెంచినట్లు తెలిసింది. గతంలో గరిష్ఠ ఫీజు సీబీఐటీలో ఉండగా, ప్రస్తుతం దాన్ని ఎంజీఐటీకి అనుమతించినట్లు సమాచారం. సీబీఐటీ ఫీజు విషయంలో హైకోర్టు అనుమతించినదాని కంటే తగ్గించినట్లు తెలుస్తోంది. గత ఏడాది వరకు సీబీఐటీ ఫీజు రూ.1.43 లక్షలుగా ఉండేది. టీఏఎ్‌ఫఆర్సీ అధికారులు మొదటి దఫా సంప్రదింపుల్లో ఈ ఫీజును రూ.1.73 లక్షలకు అంగీకరించారు. అనంతరం కోర్టు ద్వారా ఈ ఫీజుకు సీబీఐటీ కాలేజీ అనుమతి తెచ్చుకుంది. తాజాగా ఈ ఫీజును తగ్గించినట్లు సమాచారం. కాలేజీ సమర్పించిన ఆడిట్‌ నివేదికల్లో తప్పులు దొర్లాయని, డిపాజిట్లు ఎక్కువగా ఉన్నాయనే అంశాలను పరిగణనలోకి తీసుకుని ఫీజును తగ్గించినట్లు సమాచారం. అలాగే ఇంకొన్ని కాలేజీల విషయంలో కూడా మొదట టీఏఎ్‌ఫఆర్సీ అంగీకరించిన మేర కాకుండా కొంత ఫీజులను తగ్గించినట్లు తెలిసింది. ఇక ఇంజనీరింగ్‌తో పాటు ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, లా వంటి ఇతర కోర్సుల ఫీజులకు సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేయాల్సి ఉంది. రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీకి సంబంధించి రెండో దశ కౌన్సెలింగ్‌ ఈ నెల 11 నుంచి ప్రారంభం కానుంది. 16న సీట్లను కేటాయించనున్నారు. అప్పటికల్లా ఫీజులను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.

Updated Date - 2022-10-04T18:48:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising