ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పరీక్షా పే చర్చ’కు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు రిజిస్ట్రేషన్లు చేసుకోండి

ABN, First Publish Date - 2022-01-17T19:43:01+05:30

‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరారు. విద్యారంగ ప్రపంచంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మీ లక్ష్యాలు తెలుసుకునేందుకు నాకూ మంచి అవకాశం: మోదీ


న్యూఢిల్లీ, జనవరి 16: ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరారు. విద్యారంగ ప్రపంచంలో రాణి స్తున్న మన దేశ యువతను పరిచయం చేసుకునేందుకు, వారికి ఎదురవుతున్న సవాళ్లు, వారి లక్ష్యాల గురించి తెలుసుకునేందుకు తనకు కూడా ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం ద్వారా మంచి అవకాశం లభిస్తుందని తెలిపారు. పరీక్షలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నామని మోదీ ట్వీట్‌ చేశారు. విద్యార్థుల్లో పరీక్షలపై భయం, ఒత్తిడిని పోగొట్టే ఉద్దేశంతో ప్రతి ఏడాది విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమయ్యే ముందు మోదీ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ‘పరీక్షా పే చర్చ’లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులను ఎంపిక చేసేందుకు వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నారు. డిసెంబరు 28న ప్రారంభమైన ఈ పోటీలు ఈ నెల 20న ముగుస్తాయి.

Updated Date - 2022-01-17T19:43:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising