ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం: మంతెన, వాకాటి

ABN, First Publish Date - 2022-01-21T18:16:50+05:30

సీఎం జగన్‌ తన అహంకారపూరిత ధోరణితో విద్యారర్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌ తన అహంకారపూరిత ధోరణితో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన, సత్యనారాయణరాజు,  బీజేపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి  మండిపడ్డారు. ఈ మేరకు వారు వేర్వేరుగా మాట్లాడారు. దేశంలోని 12రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవులిస్తే, మన రాష్ట్రంలో ఎందుకివ్వరు? ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి బయటకు రాకుండా, మంత్రులు ఇంటి నుంచి బయటకు రాకుండా, విద్యార్థులు మాత్రం పాఠశాలలకు రావాలంటారా?  సెలవులివ్వడానికి సీఎంకు, విద్యామంత్రికి వచ్చిన ఇబ్బందేంటీ? అని మంతెన నిలదీశారు. పిల్లల ప్రాణాలు ముఖ్యమా, బడులు ముఖ్యమా? అని వాకాటి ప్రశ్నించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉపాధ్యాయులు వైరస్‌ బారిన పడ్డారని, విద్యాసంవత్సరం పోయినా, విద్యార్థుల ప్రాణాలే ముఖ్యమన్న ఎమ్మెల్సీ వాకాటి.. పొరుగు రాష్ట్రాలను చూసైనా ప్రభుత్వం నేర్చుకోవాలని, వెంటనే సెలవులు ప్రటించాలని హితవు పలికారు. 

Updated Date - 2022-01-21T18:16:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising