ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేటీఆర్ ట్వీట్.. TS TET వాయిదాపై తేల్చేసిన మంత్రి సబిత

ABN, First Publish Date - 2022-05-21T20:25:34+05:30

తెలంగాణలో జూన్-12న జరగనున్న టెట్ పరీక్షను వాయిదా వేయాల్సిందేనని గత కొన్ని రోజులుగా అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు కారణం టెట్ ఎగ్జామ్ రోజే.. ఆర్ఆర్‌బీ రైల్వే పరీక్ష ఉండటమే. మార్చిలోనే తెలంగాణ ప్రభుత్వం టెట్ ఎగ్జామ్ డేట్‌ను ప్రకటించింది. అయితే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో జూన్-12న జరగనున్న టెట్ పరీక్ష(TET EXAM)ను వాయిదా వేయాల్సిందేనని గత  కొన్ని రోజులుగా అభ్యర్థులు డిమాండ్  చేస్తున్న  సంగతి తెలిసిందే. ఇందుకు కారణం టెట్ ఎగ్జామ్ రోజే.. ఆర్ఆర్‌బీ(RRB) రైల్వే పరీక్ష ఉండటమే. మార్చిలోనే తెలంగాణ ప్రభుత్వం(Government of Telangana) టెట్ ఎగ్జామ్ డేట్‌ను ప్రకటించింది. అయితే తాజాగా.. RRB సైతం అదే రోజున పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించడంతో చాలా మంది అభ్యర్థులు ఈ రెండు పరీక్షలు రాయాల్సి ఉంది. దీంతో ఉద్యోగార్థులు అయోమయానికి గురువుతున్నారు. ఈ క్రమంలోనే టెట్ పరీక్ష వాయిదా వేయాలని ధర్నాలు చేయడం.. సోషల్ మీడియా వేదికగా మంత్రులు, విద్యాశాఖ అధికారులకు పెద్ద ఎత్తున రెక్వెస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి.


టెట్ వాయిదాపై తేల్చేసిన విద్యాశాఖ

టెట్ పరీక్షకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ గందరగోళానికి గురిచేసింది. కేటీఆర్ ట్వీట్‌పై విద్యాశాఖ స్పందించండంతో సందిగ్ధం వీడింది. జూన్ 12న టెట్ ఎగ్జామ్ జరుగుతుండగా.. అదే రోజు ఆర్‌ఆర్‌బీ పరీక్ష కూడా జరగనుంది. ఒకే రోజు రెండు పరీక్షలు ఎలా రాయాలంటూ అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. దీంతో ఒక అభ్యర్థి.. టెట్‌ను వాయిదా వేయాలంటూ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్... టెట్ అభ్యర్థి అభ్యర్థనను పరిశీలించాలంటూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సూచించారు. కేటీఆర్ ట్వీట్‌పై స్పందించిన సబితా ఇంద్రారెడ్డి.. అధికారులతో మాట్లాడానన్నారు. అయితే టెట్ వాయిదా కుదరదని అధికారులు చెప్పారని ట్విట్టర్‌లోనే మంత్రి కేటీఆర్‌కు సబిత రిప్లై ఇచ్చారు. దీంతో టెట్ వాయిదాపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.





Updated Date - 2022-05-21T20:25:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising