ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఐటీ హైదరాబాద్‌లో ఎమ్మెస్సీ మెడికల్‌ ఫిజిక్స్‌

ABN, First Publish Date - 2022-08-05T18:30:02+05:30

ఐఐటీ హైదరాబాద్‌, బసవతారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి కలిసి మెడికల్‌ ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ కోర్సును ప్రారంభించాయి. మెడికల్‌ ఫిజిక్స్‌ రంగంలో అంతర్జాతీయ స్థాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రితో కలిసి నిర్వహణ

దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 12


కంది, ఆగస్టు 4: ఐఐటీ హైదరాబాద్‌, బసవతారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి కలిసి మెడికల్‌ ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ కోర్సును ప్రారంభించాయి. మెడికల్‌ ఫిజిక్స్‌ రంగంలో అంతర్జాతీయ స్థాయి శిక్షణను అందించడం ద్వారా స్పెషలిస్ట్‌లను తయారుచేయడం ఈ కొత్త కోర్సు లక్ష్యం. ఈ మేరకు గురువారం రెండు సంస్థలు ఒప్పందం చేసుకున్నట్టు ఐఐటీ-హెచ్‌ అధికారులు ప్రకటించారు.  ఈ కోర్సు వ్యవధి 3 సంవత్సరాలు. దీనికి అటామిక్‌ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్‌ అనుమతి ఉంది. 2022 సెప్టెంబరు నుంచి కోర్సు ప్రారంభం కానుంది. కోర్సుకు అవసరమైన క్లినికల్‌ శిక్షణను బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి సహకారంతో అందిస్తారు. వ్యాధి నివారణ, రోగ నిర్థారణ, చికిత్స రంగాల్లో కెరీర్‌ను ఆశించేవారికి ఈ కోర్సు ఉపయోగపడుతుందని ఐఐటీ-హెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి వెల్లడించారు. ఫిజిక్స్‌ సబ్జెక్టుతో డిగ్రీ చేసిన అభ్యర్థులు అర్హులు. ఐఐటీ-హెచ్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆగస్టు 12లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Updated Date - 2022-08-05T18:30:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising