ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హిందీలో ఎంబీబీఎస్‌ పాఠ్యపుస్తకాలు

ABN, First Publish Date - 2022-10-17T16:05:01+05:30

దేశంలోనే మొదటిసారిగా హిందీలో ఎంబీబీఎస్‌ కోర్సును ప్రారంభించిన తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్‌ అవతరించిందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. ఆదివారం నాడిక్కడ ఎంబీబీఎస్‌ విద్యార్థులకు మూడు సబ్జెక్టులకు సంబంధించిన హిందీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మధ్యప్రదేశ్‌లో విడుదల చేసిన కేంద్ర మంత్రి అమిత్‌షా


భోపాల్‌, అక్టోబరు 16: దేశంలోనే మొదటిసారిగా హిందీలో ఎంబీబీఎస్‌ కోర్సును ప్రారంభించిన  తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్‌ అవతరించిందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. ఆదివారం నాడిక్కడ ఎంబీబీఎస్‌ విద్యార్థులకు మూడు సబ్జెక్టులకు సంబంధించిన హిందీ పాఠ్యపుస్తకాలను ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, వైద్య విద్య మంత్రి విశ్వాస్‌ సారంగ్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. ప్రపంచానికి సందేశం పంపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ  ప్రపంచ వేదికలపై హిందీలో ప్రసంగిస్తారని, ఇది దేశంలోని యువతలో విశ్వాసాన్ని పెంచుతుందని చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం ప్రధాని కలను నెరవేర్చినందుకు ఎంతో గర్వపడుతున్నానని తెలిపారు. ఈ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్నారు. దేశంలోని మరో ఎనిమిది భాషల్లో సాంకేతిక, వైద్య విద్యను ప్రారంభించే కసరత్తు జరుగుతోందని షా చెప్పారు. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, గుజరాతీ, బెంగాలీ భాషల్లో వైద్య, సాంకేతిక విద్యను అందించాలని మోదీ పిలుపునిచ్చారన్నారు. 


సానుకూల మార్పు : ప్రధాని 

హిందీలో వైద్య విద్యను ప్రారంభించడంతో దేశంలో సానుకూల మార్పు వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లక్షలాది మంది విద్యార్థులు తమ భాషలో నేర్చుకునే అవకాశం ఉంటుందని, కొత్త అవకాశాలు లభిస్తాయన్నారు. మధ్యప్రదేశ్‌లో హిందీలో ఎంబీబీఎస్‌ పాఠ్యపుస్తకాలను విడుదల చేసిన నేపథ్యంలో ప్రధాని స్పందించారు. 

Updated Date - 2022-10-17T16:05:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising