ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

LEAD: దేశంలోనే తొలిసారి.. స్టూడెంట్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ విడుదల చేసిన లీడ్

ABN, First Publish Date - 2022-09-14T01:49:13+05:30

దేశంలోని అతిపెద్ద స్కూల్‌ ఎడ్‌టెక్‌ కంపెనీ లీడ్‌ (LEAD) దేశంలోనే తొలిసారి ‘స్టూడెంట్‌ కాన్ఫిడెన్స్‌ ఇండెక్స్‌’(Student Confidence Index)ను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద స్కూల్‌ ఎడ్‌టెక్‌ కంపెనీ లీడ్‌ (LEAD) దేశంలోనే తొలిసారి ‘స్టూడెంట్‌ కాన్ఫిడెన్స్‌ ఇండెక్స్‌’(Student Confidence Index)ను విడుదల చేసింది. ఈ  అధ్యయనం ద్వారా విద్యార్ధుల ఆత్మవిశ్వాస స్థాయిని ప్రాంతాలు, నగరాలు, జనాభా, ఇతర అంశాల ఆధారంగా పరిశీలించారు. టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌  సోషల్‌ సైన్సెస్‌(Tata Institute of Social Sciences)తో కలిసి లీడ్‌ ఈ ఇండెక్స్‌ను విడుదల చేసింది. ఇందులో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఇండియా ఆత్మవిశ్వాస స్థాయి 100లో 75గా ఉంటే, 36 శాతం మంది విద్యార్థులు మాత్రమే అత్యున్నత ఆత్మవిశ్వాస స్థాయి (81–100) చూపించినట్టు ఇండెక్స్ వెల్లడించింది.


హైదరాబాద్‌ ఇండెక్స్‌ స్కోర్‌ 87గా ఉంటే, అంబాలాలో ఇది 62గా ఉంది. మెట్రో నగరాల విద్యార్థులు ఇతర నగరాల్లోని తమ సహచర విద్యార్ధులతో  పోలిస్తే కొంత ఎక్కువ ఆత్మవిశ్వాసం కలిగి ఉన్నారు. ఇక్కడ మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. ‘లీడ్‌’ విద్యార్థులు మెట్రోయేతర నగరాల్లోని  సహచర విద్యార్థులతో పోలిస్తూ ఆత్మవిశ్వాసపరంగా అన్ని అంశాలలోనూ మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారు.  


లీడ్‌ స్టూడెంట్‌ కాన్ఫిడెన్స్‌ ఇండెక్స్‌ 21వ శతాబ్దపు ఆత్మవిశ్వాసం పెంపొందించే ఐదు లక్షణాలను పరిశీలించింది. జీవితంలో విజయం సాధించేందుకు విద్యార్థులకు అత్యంత కీలకమైన అంశాలైన ఆ  లక్షణాలు ఊహాత్మక అవగాహన, విమర్శనాత్మక  ఆలోచన, కమ్యూనికేషన్‌, సహకారం, అవకాశాలు, వేదికల పట్ల అవగాహన. వీటిలోనూ ‘లీడ్’ విద్యార్థులదే పైచేయిగా ఉంది. ఇక, పశ్చిమ భారతదేశంలో విద్యార్థుల ఆత్మవిశ్వాస సూచీ ప్రాంతీయ స్థాయిలో 81గా ఉంది.  దక్షిణ, తూర్పు భారతదేశంలో ఈ స్థాయి జాతీయ సగటుకు దగ్గరలో ఉంది. బాలురతో పోలిస్తే బాలికలు మెరుగ్గా ప్రతిభ కనబరిచిన చెన్నై, ముంబై మినహా మిగిలిన మెట్రోలు, మెట్రోయేతర నగరాల్లో బాలురు, బాలికలు దాదాపుగా సమాన స్థాయిలో ఆత్మవిశ్వాసం ప్రదర్శించారు.


స్టూడెంట్‌ కాన్ఫిడెన్స్‌ ఇండెక్స్‌ కోసం 6 మెట్రో నగరాలు, 6 నాన్ మెట్రో నగరాలు, 3 టయర్ 2/3 నగరాల్లో 6–10 తరగతుల విద్యార్థులపై అధ్యయనం నిర్వహించారు. మార్కెట్‌  పరిశోధన, అధ్యయన కంపెనీ బోర్డర్‌ లెస్‌ యాక్సెస్‌ (Borderless Access) నిర్వహించింది. ఈ సందర్భంగా లీడ్ కో–ఫౌండర్‌, సీఈఓ సుమీత్‌ మెహతా మాట్లాడుతూ.. మన దేశంలో విద్యార్థుల ఆత్మవిశ్వాస స్థాయి కనుగొనే మార్గం లేదని, లీడ్ స్టూడెండ్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ ఇప్పుడు దీనిని భర్తీ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఎల్‌ఎంఆర్‌ఎఫ్‌, ఎస్‌ఎంఎల్‌ఎస్‌ డాక్టర్‌ రాహుల్‌ మాట్లాడుతూ.. లీడ్‌ స్కూల్స్‌తో తమ పరిశోధన, అవగాహన  విద్యాపరంగా విజయాలను సాధించడంలో మరీ ముఖ్యంగా విద్యార్థుల జీవితం, కెరియర్‌లో అర్థవంతమైన మార్పును తీసుకురాగల సామర్ధ్యం గురించి తమకు నమ్మకం కలిగించిందని అన్నారు.



Updated Date - 2022-09-14T01:49:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising