ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

JEE Notification: నెలాఖరులోగా జేఈఈ నోటిఫికేషన్‌?

ABN, First Publish Date - 2022-11-24T12:49:00+05:30

దేశంలోని ట్రిపుల్‌ ఐటీ, ఎన్‌ఐటీ, ఇతర ప్రముఖ విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్‌ కోర్సు(Engineering course)ల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌-2023 (జేఈఈ) నోటిఫికేషన్‌(JEE Notification) ఈ నెలాఖరులోగా వెలువడే

నెలాఖరులోగా...
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనవరిలో ప్రిలిమ్స్‌, ఏప్రిల్‌లో మెయిన్స్‌

న్యూఢిల్లీ, నవంబరు 23: దేశంలోని ట్రిపుల్‌ ఐటీ, ఎన్‌ఐటీ, ఇతర ప్రముఖ విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్‌ కోర్సు(Engineering course)ల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌-2023 (జేఈఈ) నోటిఫికేషన్‌(JEE Notification) ఈ నెలాఖరులోగా వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చేఏడాది జనవరిలో తొలివిడత (ప్రిలిమ్స్‌), ఏప్రిల్‌లో రెండో విడత (మెయిన్స్‌) పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను ఎన్‌టీఏ అధికారులు కూడా ఖండించడం లేదు. అయితే ఈ పరీక్షకు సంబంధించి ఇటీవల ఓ నకిలీ నోటిఫికేషన్‌ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడంతో విద్యార్థులు కచ్చితమైన సమాచారం కోసం జేఈఈమెయిన్‌. ఎన్‌ఐసీ.ఇన్‌ వెబ్‌సైట్‌ చూడాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు జనవరిలో ప్రిలిమ్స్‌ నిర్వహిస్తారనే సమాచారం విద్యార్థుల్లో కంగారు పుట్టిస్తోంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పలు ఇతర పరీక్షలు, ప్రాక్టికల్స్‌ ఉన్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 2021-22 విద్యా సంవత్సరంలో జేఈఈ పరీక్షలను జూన్‌, జూలై నెలల్లో నిర్వహించారు. ఈ ఏడాది జనవరిలోనే పరీక్షలంటే ఇబ్బంది ఎదురవుతుందని ఇప్పటివరకు ఇంటర్మీడియట్‌ సిలబస్‌ పూర్తికాలేదని, రివిజన్‌కు సమయం కూడా ఉండదని విద్యార్థుల పరిస్థితి అర్థం చేసుకోవాలని ఎన్‌ఐటీ అధికారులను కోరుతూ ట్విటర్‌లో పోస్టులు చేస్తున్నారు. జేఈఈ మెయిన్స్‌ ఇన్‌ ఏప్రిల్‌ హ్యాస్‌ట్యాగ్‌తో ఇది ట్విటర్‌లో ట్రెండ్‌ కావడం గమనార్హం.

Updated Date - 2022-11-24T12:49:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising