ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Good news: పాఠశాలల విలీనంపై జగన్ సర్కార్ వెనక్కి!

ABN, First Publish Date - 2022-08-09T16:57:33+05:30

ఎమ్మెల్యేలు(MLAs) అభ్యంతరాలు వ్యక్తం చేసిన పాఠశాలల్లో తరగతుల విలీనం(Merger of schools)పై ప్రభుత్వం వెనక్కి తగ్గింది(Jagan Govt). ఈ అభ్యంతరాలపై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీలు ఇచ్చిన నివేదికల ఆధారంగా విద్యార్థులకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యేల అభ్యంతరాలపై ప్రభుత్వం ఆదేశాలు

400 స్కూళ్ల విద్యార్థులకు ఉపశమనం


అమరావతి, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేలు(MLAs) అభ్యంతరాలు వ్యక్తం చేసిన పాఠశాలల్లో తరగతుల విలీనం(Merger of schools)పై ప్రభుత్వం వెనక్కి తగ్గింది(Jagan Govt). ఈ అభ్యంతరాలపై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీలు ఇచ్చిన నివేదికల ఆధారంగా విద్యార్థులకు ఇబ్బంది కలిగించే చోట్ల విలీనాన్ని ఆపేయాలంటూ పాఠశాల విద్యాశాఖ(School Education Department) ఆదేశాలు జారీచేసింది. దీంతో సుమారు 400 పాఠశాలల్లో విలీన ప్రక్రియ ఆగిపోనుంది. రాష్ట్రవ్యాప్తంగా 5,870 పాఠశాలల్లో విలీన ప్రక్రియ చేపట్టగా అభ్యంతరాలుంటే తెలపాలని విద్యాశాఖ మంత్రి(Education Minister Botsa Satyanarayana).. ఎమ్మెల్యేలకు లేఖ రాశారు. స్పందించిన 70 మంది ఎమ్మెల్యేలు.. సుమారు 400 పాఠశాలల్లో విలీనం ఇబ్బందిగా మారిందని, నిలిపివేయాలని కోరారు. దీనిపై పరిశీలనకు పాఠశాల విద్యాశాఖ కమిటీలు వేసింది. ఆ కమిటీల నివేదికల ఆధారంగా ఇబ్బందులున్న చోట్ల విలీనం ఆపేయాలని తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. అలాగే ఈ ప్రక్రియ పూర్తయినా ఇంకా ఎక్కడైనా విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే.. దానికి సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది.

Updated Date - 2022-08-09T16:57:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising