ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటర్‌ మొదటి సంవత్సర ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

ABN, First Publish Date - 2022-01-18T23:06:06+05:30

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముథోల్‌, జనవరి17: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ప్రతిభ క ళాశాలలు, సాధారణ, వృత్తి విద్యా కళాశాలలో 2022-23 విద్యాసంవత్సరానికి మొదటి సంవత్సర ఇంటర్మీడియట్‌, వృత్తి విద్యా కోర్సులలో ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ శివరాం ఒక ప్రకటనలో తె లిపారు. మార్చిలో ఎస్‌ఎస్‌సీ పబ్లిక్‌ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు లేదా సీబీఎస్‌సీ/ఐసీఎస్‌సీ బోర్డుల ద్వారా 2021-22 సంవత్సరంలో పదో త రగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనా ర్టీ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. తల్లిదం డ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో లక్ష 50 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల ఆదాయం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవా లని సూచించారు. ఈనెల 25న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 20న ఉంటుం దన్నారు. ఆసక్తి గల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Updated Date - 2022-01-18T23:06:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising