ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ వస్తే.. ఇంటర్వ్యూకి హాజరు ఎలా? తేదీలు మార్చండి లేదా ‘ఆన్‌లైన్‌’ చేయండి

ABN, First Publish Date - 2022-01-18T22:55:05+05:30

కొవిడ్‌ సమయంలో విద్యాసంస్థల్లో ప్రవేశాలకు కానీ, ఉద్యోగాలకు కానీ.. దేనికైనా ఇంటర్వ్యూలు నిర్వహించేటప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలపైనా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్‌సెట్‌ అభ్యర్థుల వేడుకోలు

అమరావతి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ సమయంలో విద్యాసంస్థల్లో ప్రవేశాలకు కానీ, ఉద్యోగాలకు కానీ.. దేనికైనా ఇంటర్వ్యూలు నిర్వహించేటప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలపైనా దృష్టిపెట్టాలి. ఇంటర్వ్యూలు నిర్వహించాల్సిందే అనుకున్నప్పుడు ఆన్‌లైన్‌లో నిర్వహించడం, లేకుంటే కొవిడ్‌ నిర్ధారణ అయినవారికి ప్రత్యామ్నాయ తేదీల్లో ఇంటర్వ్యూకు అవకాశం కల్పించడం ఏదో ఒకటి చేయాలి. కానీ అవేమీ చేయకపోవడం వల్ల కరోనా సోకిన అభ్యర్థుల పరిస్థితి ఏమిటన్నదే ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. ఇటీవల రిసెర్చ్‌ సెట్‌ (ఆర్‌సెట్‌) కోసం ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించారు. దీనిలో అర్హత సాధించినవారికి పీహెచ్‌డీల్లో చేరేందుకు అవకాశం కల్పిస్తారు. అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రస్తుతం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.


అయితే వీరిలో కొంతమంది అభ్యర్థులకు కొవిడ్‌ వైరస్‌ సోకింది. కాబట్టి వారు ఇంటర్వ్యూలకు హాజరు కాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో తమకు మరో తేదీలో ఇంటర్వ్యూలు నిర్వహించాలని, లేకుంటే ఆన్‌లైన్‌లోనైనా ఇంటర్వ్యూ చేయాలని వారు వేడుకుంటున్నారు. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల వారంతా మానసిక ఆందోళనకు గురవుతున్నారు. 

Updated Date - 2022-01-18T22:55:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising