ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రేడ్‌-2 సూపర్‌ వైజర్‌.. పరీక్ష, ఫలితాలపై అభ్యంతరాలు

ABN, First Publish Date - 2022-01-22T17:46:32+05:30

అంగన్‌వాడీ కేంద్రాల్లో గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష, ఫలితాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోర్టుకు వెళ్లే యోచనలో అంగన్‌వాడీ టీచర్లు

హైదరాబాద్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాల్లో గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష, ఫలితాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 433 పోస్టుల భర్తీకి జనవరి 2న నిర్వహించిన పరీక్షకు 16,815 మంది హాజరయ్యారు. అయితే పరీక్ష రాసేందుకు సరిపడా సమయం ఇవ్వలేదని అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫలితాలు వెల్లడించిన తర్వాత రీ కౌంటింగ్‌కు అధికారులు అవకాశం కల్పించలేదని మరికొందరు విమర్శిస్తున్నారు.


అంగన్‌వాడీ టీచర్లకు గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ పదోన్నతికి నిర్వహించిన పరీక్ష ప్రశ్నపత్రం సివిల్స్‌ స్థాయిలో రూపొందించారని ఆరోపిస్తున్నారు. సుమారు 40 పేజీల ప్రశ్నపత్రం ఇచ్చి కేవలం 90 నిమిషాల వ్యవధిలో పూర్తిచేయాలనడం సరికాదని అంటున్నారు.  వికలాంగులు, వితంతువులకు అదనపు మార్కులు ఇవ్వాల్సి ఉండగా అలా చేయలేదని ఆరోపిస్తున్నారు. మొత్తంగా గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ పరీక్ష, ఫలితాల తీరుపై కోర్టును ఆశ్రయించేందుకు కొందరు అంగన్‌వాడీలు సిద్ధం అవుతున్నారు.

Updated Date - 2022-01-22T17:46:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising