ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kendriya Vidyalaya మహబూబాబాద్‌లో పోస్టులు

ABN, First Publish Date - 2022-03-02T19:52:29+05:30

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖకు చెందిన మహబూబాబాద్‌(తెలంగాణ)లోని కేంద్రీయ విద్యాలయం ఒప్పంద ప్రాతిపదిక వివిధ ఖాళీల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖకు చెందిన మహబూబాబాద్‌(తెలంగాణ)లోని కేంద్రీయ విద్యాలయం ఒప్పంద ప్రాతిపదిక వివిధ ఖాళీల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

పోస్టులు: టీచింగ్‌, నాన్‌టీచింగ్‌


ప్రైమరీ టీచర్‌(పీఆర్‌టీ)

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌తోపాటు సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌/బీఈడీ ఉత్తీర్ణత. సీటెట్‌ అర్హతతోపాటు హిందీ, ఇంగ్లీష్‌ మాధ్యమాల్లో టీచింగ్‌ ప్రొఫిషియెన్సీ, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.21,250 చెల్లిస్తారు


ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు(టీజీటీ)

సబ్జెక్టులు: ఇంగ్లీష్‌; హిందీ, సంస్కృతం, సైన్స్‌, సోషల్‌ సైన్స్‌, మేథ్స్‌

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సీటెట్‌ అర్హతతోపాటు కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.26,250 చెల్లిస్తారు.


కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌

అర్హత: బీఈ/బీటెక్‌తో పాటు పీజీ డిప్లొమా(కంప్యూర్స్‌) ఉత్తీర్ణత. హిందీ, ఇంగ్లీష్‌ మాధ్యమాల్లో టీచింగ్‌ ప్రొఫిషియెన్సీ ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.26,250 చెల్లిస్తారు.


ఎడ్యుకేషనల్‌ కౌన్సెలర్‌

అర్హత: ఎంఏ/ఎమ్మెస్సీ(సైకాలజీ) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 

జీతభత్యాలు: నెలకు రూ.26,250 చెల్లిస్తారు.


గేమ్స్‌, స్పోర్ట్స్‌ కోచ్‌/యోగా టీచర్లు

అర్హత: సాయ్‌ కోచ్‌లు, ఎన్‌ఐఎ్‌స/ఎంపీఈడీ ఉత్తీర్ణతతోపాటు అనుభవం, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.21,250 చెల్లిస్తారు.


నర్సింగ్‌ సిస్టర్‌

అర్హత: బీఎస్సీ(నర్సింగ్‌)/డిప్లొమా(జీఎన్‌ఎం నర్సింగ్‌)/తత్సమాన ఉత్తీర్ణత. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. 

జీతభత్యాలు: రోజుకు రూ.750 చెల్లిస్తారు.


డేటా ఎంట్రీ ఆపరేటర్లు

అర్హత: ఇంటర్మీడియట్‌/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. టైపింగ్‌లో స్పీడ్‌తోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.15,000 చెల్లిస్తారు


పీఆర్‌టీ మ్యూజిక్‌

అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతోపాటు మ్యూజిక్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణత. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.21,250 చెల్లిస్తారు

ఎంపిక విధానం: వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

ఇంటర్వ్యూ తేదీలు: మార్చి 08, 09

రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: మార్చి 04

వెబ్‌సైట్‌: https://mahabubabad.kvs.ac.in/

Updated Date - 2022-03-02T19:52:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising