ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Inter అర్హతతో CRPFలో పోస్టులు

ABN, First Publish Date - 2022-12-31T12:15:01+05:30

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ (Union Ministry of Home Affairs) పరిధిలోని సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (Central Reserve Police Force) (సీఆర్‌పీఎఫ్‌) ఎస్‌ఐ (si), కానిస్టేబుల్‌(Constable) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల

CRPFలో పోస్టులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ (Union Ministry of Home Affairs) పరిధిలోని సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (Central Reserve Police Force) (సీఆర్‌పీఎఫ్‌) ఎస్‌ఐ (si), కానిస్టేబుల్‌(Constable) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 1458 ఎస్‌ఐ(స్టెనో), హెడ్‌ కానిస్టేబుల్‌(మినిస్టీరియల్‌) ఖాళీలున్నాయి.

1. అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (స్టెనోగ్రాఫర్‌): 143 పోస్టులు

2. హెడ్‌ కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌): 1315 పోస్టులు

అర్హత: ఇంటర్మీడియట్‌(10+2) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు నిర్ధిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. పురుషులు 165 సెం.మీ., మహిళలు 155 సెం.మీ.ఎత్తు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 2023 జనవరి 25 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు ఏఎస్‌ఐ పోస్టుకు రూ.29,200- రూ.92,300; హెడ్‌కానిస్టేబుల్‌ పోస్టుకు రూ.25,500- రూ.81,100

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, డిటైల్డ్‌ మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌: పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. ప్రశ్న పత్రం ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ఉంటుంది. 100 మార్కులకు గాను 100 ప్రశ్నలు ఇస్తారు. హిందీ/ఇంగ్లీష్‌ భాష, జనరల్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, నర్సంపేట, నిజామాబాద్‌, సత్తుపల్లి, సూర్యాపేట, వరంగల్‌, అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లె, మార్కాపురం, నంద్యాల, నెల్లూరు, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: జనవరి 4

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 25

సీబీటీ అడ్మిట్‌కార్డు విడుదల: ఫిబ్రవరి 15

పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 22-28

వెబ్‌సైట్‌: https://crpf.gov.in/

Updated Date - 2022-12-31T12:15:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising