ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ESCIలో పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌

ABN, First Publish Date - 2022-09-16T16:50:18+05:30

హైదరాబాద్‌లోని ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (Esci) ఆధ్వర్యంలోని స్కూల్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్టడీస్‌ - పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం) ప్రోగ్రామ్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌లోని ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (Esci) ఆధ్వర్యంలోని స్కూల్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్టడీస్‌ - పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌, జనరల్‌ మేనేజ్‌మెంట్‌, ఇండస్ట్రియల్‌ సేఫ్టీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాలు అందుబాటులో ఉన్నాయి. ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. ఇందులో నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ప్రోగ్రామ్‌నకు ఏఐసీటీఈ గుర్తింపు ఉంది. 


ప్రోగ్రామ్‌ వివరాలు: ప్రోగ్రామ్‌లో భాగంగా విభాగానికి నిర్దేశించిన సబ్జెక్ట్‌లతో పాటు మేజర్‌, మైనర్‌ స్పెషలైజేషన్‌ సబ్జెక్ట్‌లు చదవాల్సి ఉంటుంది. అన్ని విభాగాల్లో ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌ అనే మైనర్‌ స్పెషలైజేషన్‌ సబ్జెక్ట్‌లు ఉంటాయి.   

  • ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో సివిల్‌, పవర్‌ అండ్‌ ఎనర్జీ, టెలీకాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌; ఇండస్ట్రియల్‌ సేఫ్టీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో మాన్యుఫాక్చరింగ్‌ ఇండస్ట్రీ సేఫ్టీ, సర్వీస్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ సెక్టర్‌ సేఫ్టీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సేఫ్టీ మేనేజ్‌మెంట్‌, ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అండ్‌ సేఫ్టీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌ అనే మేజర్‌ స్పెషలైజేషన్‌ సబ్జెక్ట్‌లు ఉంటాయి. 

అర్హత: స్పెషలైజేషన్‌కు నిర్దేశించిన ప్రకారం ఆర్ట్స్‌/ కామర్స్‌/ సైన్స్‌/ మేనేజ్‌మెంట్‌/ ఇంజనీరింగ్‌/ టెక్నాలజీ విభాగాల్లో కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. క్యాట్‌/ మ్యాట్‌/ ఏటీఎంఏ/ ఐసెట్‌ అర్హత పొంది ఉండాలి. 


ముఖ్య సమాచారం

ప్రోగ్రామ్‌ ఫీజు: రూ.4,30,000

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 30

వెబ్‌సైట్‌: esci.edu.in



Updated Date - 2022-09-16T16:50:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising