ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమానావకాశాల కల్పనే విద్య లక్ష్యం కావాలి

ABN, First Publish Date - 2022-05-18T20:02:40+05:30

ఉత్పత్తిలో ప్రధాన భాగస్వాములైన పేద వర్గాలను విద్యకు దూరం చేసే 2020 జాతీయ విద్యావిధానాన్ని ఉపసంహరించాలి. అందరికీ సమాన అవకాశాలు ఇచ్చే విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టాలి’’ అని స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జాతీయ విద్యా విధానం పేదలను చదువుకు దూరం చేస్తుంది

సమైక్య భావనకు తూట్లు పొడుస్తుంది

ఎస్‌టీఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సీఎన్‌ భారతి


విజయవాడ(గవర్నర్‌పేట), మే 17: ‘‘ఉత్పత్తిలో ప్రధాన భాగస్వాములైన పేద వర్గాలను విద్యకు దూరం చేసే 2020 జాతీయ విద్యావిధానాన్ని ఉపసంహరించాలి. అందరికీ సమాన అవకాశాలు ఇచ్చే విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టాలి’’ అని స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీఎఫ్‌ఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి సీఎన్‌ భారతి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈనెల 20, 21, 22 తేదీల్లో విజయవాడలో జరిగే ఎస్‌టీఎ్‌ఫఐ జాతీయ 8వ మహాసభల ఏర్పాట్లు పరిశీలించేందుకు నగరానికి వచ్చిన సంస్థ జాతీయ అధ్యక్షుడు అభిజిత్‌ ముఖర్జీతో కలిసి మంగళవారం ఆయన యూటీఎఫ్‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 29 రాష్ట్రాల్లో 31 సంఘాల కలయికతో ఏర్పడిన ఎస్‌టీఎ్‌ఫఐ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతోందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 2020 జాతీయ విద్యావిధానం సమైక్య భావనకు తూట్లు పొడుస్తూ, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉందన్నారు. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య స్థానంలో కార్పొరేట్లకు దోచిపెట్టే విధంగా విద్యావిధానాన్ని రూపొందించారన్నారు. అశాస్త్రీయ అంశాలు ముందుకు తెస్తూ అందరూ సమానమనే భావనకు వ్యతిరేకంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల జీవితాలను మార్కెట్‌ శక్తులకు తాకట్టు పెట్టే సీపీఎస్‌ విధానం రద్దు కోసం ఏపీతో సహ వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న పోరాటాలకు ఎస్‌టీఎ్‌ఫఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందన్నారు. విజయవాడలో జరిగే జాతీయ మహాసభలకు దేశ వ్యాప్తంగా 1,000 మంది ప్రతినిధులు హాజరౌతారని తెలిపారు. 2020 జాతీయ విద్యా విధానాన్ని ఉపసంహరించాలని, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్‌లపై చర్చలు, సెమినార్‌లు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో యుటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.వెంకటేశ్వర్లు, కెఎ్‌సఎస్‌ ప్రసాద్‌, గౌరవాధ్యక్షుడు కె. శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శులు ఎ.కృష్ణసుందరరావు, ఎస్‌పీ మనోహర్‌కుమార్‌, బి.గోపిమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-18T20:02:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising