ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూతన విద్యావిధానంపై రాజకీయ విమర్శలు వద్దు

ABN, First Publish Date - 2022-05-28T16:05:08+05:30

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానంపై రాజకీయపరమైన విమర్శలు చేయడం తగదని రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి పేర్కొన్నారు. తిరువారూరు సెంట్రల్‌ యూనివర్సిటీలో శుక్రవారం ఉదయం నూతన విద్యావిధానంపై జరిగిన 36 సెంట్రల్‌ యూనివర్సిటీలకు చెందిన వీసీల సదస్సులో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీసీల సదస్సులో గవర్నర్‌ పిలుపు


చెన్నై: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానంపై రాజకీయపరమైన విమర్శలు చేయడం తగదని రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి పేర్కొన్నారు. తిరువారూరు సెంట్రల్‌ యూనివర్సిటీలో శుక్రవారం ఉదయం నూతన విద్యావిధానంపై జరిగిన 36 సెంట్రల్‌ యూనివర్సిటీలకు చెందిన వీసీల సదస్సులో ఆయన ప్రసంగించారు. మారుతున్న పరిస్థితుల కు అనుగుణంగా కేంద్రప్రభుత్వం విద్యావిధానంలో పలు మార్పులు చేస్తోందని, విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించడానికే ఈ విధానాన్ని ప్రవేశపెడుతోందన్నారు. నూతన విద్యావిధానంలో ఏవైనా నచ్చని అంశాలుంటే రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలను తెలియజేసే అవకాశం కూడా ఉందని తెలిపారు. నాణ్యతతో కూడిన విద్యనందించేందుకే కేంద్రం నూతన విద్యావిధానాన్ని అమలు చేయనుందని స్పష్టం చేశారు. ఈ సదస్సులో కేంద్ర విద్యాశాఖ మంత్రి సుభాష్‌ సార్కర్‌, శిక్షా సేన్‌స్ర్కిట్‌ ఉద్దన్‌ న్యాస్‌ జాతీయ కార్యదర్శి అతుల్‌ కొథారి, కేంద్ర పరిశోధన శాఖ సంచాలకులు ఆశీర్వాదం ఆచ్చారి, తిరువారూరు సెంట్రల్‌ యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ కృష్ణన్‌, రిజిస్ట్రార్‌ సులోచనా శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం గవర్నర్‌ తిరువారూరు త్యాగరాజస్వామివారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయం వద్ద గవర్నర్‌కు ప్రధానార్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 

Updated Date - 2022-05-28T16:05:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising