ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌ గారడీ మాటలు నమ్మొద్దు.. నిరుద్యోగ భృతి హామీ ఏమైంది?

ABN, First Publish Date - 2022-04-27T17:01:17+05:30

సీఎం కేసీఆర్‌ గారడీ మాటలు నమ్మి మోసపోవద్దని వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రజలను కోరారు. ప్రజాప్రస్థానం పేరుతో ఆమె చేపట్టిన పాదయాత్ర 67వ రోజు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక, రెడ్డిపాలెం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బూర్గంపాడు ఏప్రిల్‌ 26: సీఎం కేసీఆర్‌ గారడీ మాటలు నమ్మి మోసపోవద్దని వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రజలను కోరారు. ప్రజాప్రస్థానం పేరుతో ఆమె చేపట్టిన పాదయాత్ర 67వ రోజు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక, రెడ్డిపాలెం, నాగినేనిప్రోలు, బూర్గంపాడు గ్రామాల్లో కొనసాగింది. బూర్గంపాడులో నిరుద్యోగ నిరాహార దీక్షలో మాట్లాడారు. ఈ సందర్భంగా నిరుద్యోగ భృతి హామీ ఏమైందని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. నిరుద్యోగులు, మహిళలు, రైతులు ఇలా అన్నివర్గాల ప్రజలను  మోసగించారని విమర్శించారు. ఎన్నికల హామీలు అమలు చేయలేదన్ననరు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటున్నా చర్యలు లేవన్నారు. ప్రజలను పట్టించుకునేవారు లేకపోవటంతో పార్టీని స్థాపించానని చెప్పారు. తనను గెలిపిస్తే.. అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలను అమలు చేస్తానని హామీ ఇచ్చారు. 

Updated Date - 2022-04-27T17:01:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising