ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిషన్‌ ఇంద్రధనుష్‌ ఎప్పుడు ప్రారంభమైంది? పోటీ పరీక్షల ప్రత్యేకం!

ABN, First Publish Date - 2022-07-07T21:19:12+05:30

2014 అక్టోబరు 2న దీనిని ప్రారంభించారు. ‘నిర్మల్‌ భారత్‌ అభియాన్‌’ పథకాన్ని ‘స్వచ్ఛ భారత్‌’లో విలీనం చేశారు. ఈ పథకం లోగో గాంధీజీ కళ్లద్ధాలు. మహాత్మాగాంధీ 150వ జయంతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్వచ్ఛ భారత్‌: 2014 అక్టోబరు 2న దీనిని ప్రారంభించారు. ‘నిర్మల్‌ భారత్‌ అభియాన్‌’ పథకాన్ని ‘స్వచ్ఛ భారత్‌’లో విలీనం చేశారు. ఈ పథకం లోగో గాంధీజీ కళ్లద్ధాలు. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా 2019 అక్టోబరు 2 నాటికి భారత్‌ను ‘క్లీన్‌ ఇండియా’గా మార్చడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ‘‘ఏక్‌ కదమ్‌ స్వచ్ఛ భారత్‌కే ఓర్‌’’ ఈ పథకం నినాదం.

సంసద్‌ ఆదర్శ గ్రామ యోజన: 2014 అక్టోబరు 11న దీనిని ప్రారంభించారు. జయ ప్రకాశ్‌ నారాయణ్‌ జయంతిని పురస్కరించుకుని దీనిని ప్రారంభించారు. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు తమ నియోజకవర్గం పరిధిలో సంవత్సరానికి ఒక్కో గ్రామాన్ని దత్తత  తీసుకుని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి. 2019 నుంచి ఏటా ఒక గ్రామం చొప్పున 2024 నాటికి ప్రతి ఎంపీ 5 గ్రామాలను అభివృద్ధి చేయాలి.

మిషన్‌ ఇంద్రధనుష్‌: 2014 డిసెంబరు 25న ప్రారంభించారు. చిన్న పిల్లలకు 7 రకాల వ్యాధుల నుంచి రక్షించేందుకు టీకాలు ఇచ్చే కార్యక్రమం ఇది. ఆ వ్యాధులు... డిఫ్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం, పోలియో, క్షయ, తట్టు, హెపటైటీస్‌ బి.

మేక్‌ ఇన్‌ ఇండియా: 2014 సెప్టెంబరు 25న ప్రారంభించారు. భారత్‌లోని 25 రంగాల్లో ఉపాధి కల్పన, నైపుణ్యాలు పెంచడం కోసం చర్యలు తీసుకుంటారు. విదే శీ పెట్టుబడులను 25 రంగాల్లో ప్రోత్సహించడం. భారతదేశాన్ని తయారీకేంద్రంగా మార్చడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.

దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్‌ యోజన: 2014 సెప్టెంబరు 25న ప్రారంభించారు. ఈ పథకాన్ని అజీవక స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రాం అని కూడా పిలుస్తారు. 10 లక్షల మంది గ్రామీణ యువతకు ఉద్యోగాలు పొందడంలో నైపుణ్య శిక్షణ ఇస్తారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన: 2014 సెప్టెంబరు 25న ప్రారంభించారు. పట్టణ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్మూలించేందుకు ఈ పథకాన్ని చేపట్టారు. పట్టణాల్లోని ఒక పేద వ్యక్తికి రూ.15,000 నుంచి రూ.18,000 ఖర్చుతో నైపుణ్యాలు నేర్పిస్తారు. పట్టణ పేదలకు స్వయం ఉపాధి కల్పిస్తారు.


-రాయల రాధాకృష్ణ

సీనియర్‌ ఫ్యాకల్టీ



Updated Date - 2022-07-07T21:19:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising