ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైకుంఠ మెహత ఇన్‌స్టిట్యూట్‌లో పీజీడీఎం - ఏబీఎం

ABN, First Publish Date - 2022-09-24T22:47:52+05:30

పుణెలోని వైకుంఠ మెహత నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కోఆపరేటివ్‌ మేనేజ్‌మెంట్‌(Vaikuntha Mehta National Institute of Cooperative Management) (వీఏఎంఎన్‌ఐసీఓఎం) - పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుణెలోని వైకుంఠ మెహత నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కోఆపరేటివ్‌ మేనేజ్‌మెంట్‌(Vaikuntha Mehta National Institute of Cooperative Management) (వీఏఎంఎన్‌ఐసీఓఎం) - పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనికి ఏఐసీటీఈ, ఎన్‌బీఏ సంస్థల గుర్తింపు ఉంది. అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీస్‌ (ఏఐయూ) దీనిని  ఎంబీఏ డిగ్రీతో సమానంగా పరిగణిస్తుంది. జాతీయ పరీక్ష స్కోర్‌, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అడ్మిషన్స్‌ ఇస్తారు. విదేశీ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.


ప్రోగ్రామ్‌ వివరాలు: ఇది ఫుల్‌ టైం రెసిడెన్షియల్‌ ప్రోగ్రామ్‌. దీని వ్యవధి రెండేళ్లు. ఇందులో 6 టర్మ్‌లు ఉంటాయి. వీటిలో కోర్‌ మేనేజ్‌మెంట్‌ సబ్జెక్ట్‌లకు 26 క్రెడిట్స్‌, స్పెషలైజేషన్‌ సబ్జెక్ట్‌లకు 12 క్రెడిట్స్‌ నిర్దేశించారు. 

అర్హత: ద్వితీయ శ్రేణి మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అర్హులే. క్యాట్‌/ మ్యాట్‌/ ఎక్స్‌ఏటీ/ ఏటీఎంఏ/సీమ్యాట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ ఉండాలి. విదేశీ అభ్యర్థులకు జీమ్యాట్‌/ జీఆర్‌ఈ స్కోర్‌ ఉండాలి.

స్కాలర్‌షిప్‌: ఈ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందినవారిలో ఆరుగురికి నేషనల్‌ కో-ఆపరేటివ్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌సీయూఐ) ఏడాదికి రూ.40,000ల స్కాలర్‌షిప్‌ ఇస్తుంది. మెరిట్‌ ప్రకారం ఒక ఎస్టీ, ఇద్దరు ఎస్సీ అభ్యర్థులకు ఏడాదికి రూ.15,000ల ఇఫ్కో స్కాలర్‌షిప్‌ లభిస్తుంది. ఇద్దరు విదేశీ అభ్యర్థులతోపాటు మరో ఇద్దరు భారత విద్యార్థులకు సీఐసీటీఏబీ మెరిటోరియస్‌ అవార్డ్‌ ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులందరికీ భారత ప్రభుత్వం పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ అందిస్తుంది. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.500  

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2023 జనవరి 11 నుంచి

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 2023 మార్చి 31

వెబ్‌సైట్‌: www.vamnicom.gov.in

Updated Date - 2022-09-24T22:47:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising